Main Menu

టాప్ లోనే కోహ్లీ

Spread the love

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తిరుగుండ‌డం లేదు. పొట్టి క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ వేర‌యినా బ్యాట్ కి ప‌నిచెప్ప‌డంలో కింగ్ కోహ్లీ అనిపించుకుంటున్నాడు. దాంతో తాజా ఐసీపీ ర్యాకింగ్స్ లో కూడా అగ్ర‌పీఠం లో నిలిచాడు. ఆసీస్ తో కీల‌క సిరీస్ కి ముందు టాప్ లో ఉన్న విరాట్ అదే త‌ర‌హా ఆట‌తీరుతో సాగాల‌ని అంతా ఆశిస్తున్నారు.

ఇక ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌ లో భారత కెప్టెన్‌ కోహ్లీ 935 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌) తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. బౌలర్లలో అశ్విన్‌ ఏడో ర్యాంక్‌కు ఎగబాకగా, జడేజా 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ విభాగంలో జేమ్స్‌ ఆండర్సన్‌ (ఇంగ్లండ్‌)ను రెండో స్థానానికి నెట్టి రబాడ (దక్షిణాఫ్రికా) 882 పాయింట్లతో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మహమ్మద్‌ అబ్బాస్‌ (పాకిస్థాన్‌) మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టెస్టు లో 14 వికెట్లు తీసిన యాసిర్‌ షా (పాకిస్థాన్‌) 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *