Main Menu

కోహ్లీ టాప్ లోనే..!

Spread the love

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఐసిసి ప్రకటించిన జాబితాలో 922 పాయింట్లతో కోహ్లీ టాప్‌లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో తొలిటెస్ట్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడిన శ్రీలంకకు చెందిన కుశాల్‌ పెరీరా 58 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌ బెస్ట్‌ 40వ స్థానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 51, రెండో ఇన్నింగ్స్‌ అజేయంగా 153 పరుగులు చేసిన పెరీరా కేవలం 15 టెస్ట్‌ మ్యాచుల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం.

ఇక టెస్ట్‌ బ్యాట్స్‌మన్ల జాబితాలో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(877 పాయింట్లు) రెండు, పుజారా (881 పాయింట్లు) మూడోస్థానంలో నిలిచారు. ఇక టెస్ట్‌ బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన పాట్‌ కమ్మిన్స్‌ దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ రబాడాను వెనక్కినెట్టి తొలిస్థానాన్ని ఆక్రమించాడు. దీంతో ఆస్ట్రేలియా తరఫున మెక్‌ గ్రాత్‌ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన బౌలర్‌గా కమిన్స్‌ నిలిచాడు.

భారత్‌కు చెందిన రవిచంద్రన్‌ అశ్విన్‌ 794 పాయింట్లతో ఐదోస్థానంలో, జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. టెస్ట్‌ జట్ల జాబితాలో భారత్‌ (116 పాయింట్లు)తో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు ఉన్నాయి.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *