కోహ్లీ కొత్త చరిత్ర

during the 2015 ICC Cricket World Cup match between India and Pakistan at Adelaide Oval on February 15, 2015 in Adelaide, Australia.
Spread the love

టీమిండియా సారధి మరో రికార్డ్ సాధించాడు. పరుగుల వరద పారిస్తూ కొత్త చరిత్ర స్రుష్టిస్తున్నాడు. వన్డే క్రికెట్ లో తిరుగులేని స్థానానికి చేరుకుంటున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో ఈ పరుగుల మెషీన్‌ విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. తాజాగా ఆరు వన్డేల సిరీస్ లో ఏకంగా 500కు పైగా పరుగులు సాధించి కొత్త చరిత్ర రాశాడు. తద్వారా కెప్టెన్ గానూ, ఆటగాడు గానూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా గడ్డ మీద 6 వన్డేల సిరీస్ లో 5 వన్డేలు సాధించిన తొలి విదేశీ జట్టు సారధిగా కోహ్లీ రికార్డ్ పుటలకెక్కాడు.

ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్‌ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్‌ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్‌(13), కోహ్లి(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌(22) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ(11) రికార్డును ఇటీవలే కోహ్లి అధిగమించిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఘనత కూడా కోహ్లి(14 సెంచరీలు) పేరిటే ఉంది.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *