షారూఖ్ ని మించిపోయిన కోహ్లీ

621828-virat-kohli-afp
Spread the love

మన దేశానికి సంబంధించి ‘ప్రసిద్ధ ప్రచారకర్తల జాబితా’లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు కిందకు నెట్టేశాడు. ప్రఖ్యాత కార్పొరేట్ వాణిజ్య సలహాదారు అయిన ‘దుఫ్ అండ్ ఫెల్ప్స్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. ‘కోటీశ్వరుల ఎదుగుదల’ పేరిట ఆ సంస్థ విడుదల చేసిన నివేదికలో భారత్‌లో ‘ప్రచారకర్తలైన ప్రసిద్ధ వ్యక్తుల జాబితా’లో కోహ్లీ, నటి దీపికా పదుకొనె, నటుడు రణ్‌వీర్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. తాము ర్యాంకింగ్‌లు ఇస్తున్నప్పటి నుంచి చూస్తే- తొలిసారిగా షారుఖ్ స్థాయి కిందకు పడిపోయిందని, ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీ భర్తీ చేశాడని ఆ సంస్థ తెలిపింది.

ఇపుడు ఉత్పత్తిదారులు తమ అమ్మకాలను విస్తృతం చేసుకునేందుకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా కోహ్లీనే ఎక్కువగా కోరుకుంటున్నారని ‘డుఫ్ అండ్ ఫెల్ప్స్’ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా తెలిపారు. కోహ్లీతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఆలియా భట్, వరుణ్ ధావన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులకు ‘బ్రాండ్ అంబాసిడర్లు’గా డిమాండ్ పెరుగుతోంది. బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటీనటులకు ఆదరణ తగ్గకపోయినా, ఇపుడు కోహ్లీ, ధోనీ, పీవీ సింధు వంటి క్రీడాకారులకు ‘క్రేజ్’ పెరుగుతోంది. పర్యాటకం, క్రీడాపోటీలు, సౌందర్య సాధనాలు, ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్స్, దుస్తులు, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించడం పరిపాటిగా మారింది. ప్రముఖ నటీనటులనే కాదు, ప్రసిద్ధ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తూ భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయని ‘దుఫ్ అండ్ ఫెల్ప్స్’ చెబుతోంది.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *