చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ

dhoni kohli
Spread the love

టెస్ట్ సిరీస్ చేజార్చుకున్నప్పటికీ వన్డేలలో మాత్రం టీమిండియా శుభారంభం చేసింది. దక్షిణాప్రికా గడ్డ మీద ఆరు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ను సునాయాసంగా దక్కించుకుంది. ఛేజింగ్ కింగ్ కోహ్లీ చెలరేగడంతో 270 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. డర్బన్ కింగ్స్ మీడ్ స్టేడియంలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఛేజింగ్ లో తన రికార్డ్ ను మరింత మెరుగుపరుచుకుంది. 11 వన్డేలలో ఛేజింగ్ లో 10మ్యాచ్ లలో విజయం దక్కించుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది. ముఖ్యంగా స్పిన్నర్ల ధాటికి తల్లడిల్లింది. ఆ క్రమంలో కుల్దీప్ యాదవ్3, చాహాల్ 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం చెలరేగి ఆడాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా చొరవతో సెంచరీ సాధించాడు. వన్డేలలో టీమిండియా మీద రెండో సెంచరీ సాధించి 120 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో 269 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు తొలుత రోహిత్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. 20 పరుగులు చేసి రోహిత్ అవుటయ్యాడు. ఆ తర్వాత ధావన్ దూకుడు మీదున్న దశలో 35 రన్స్ చేసి 57 పరుగుల వద్ద అనవసరపు రన్ కోసం కోహ్లీ ఒత్తిడితో రనౌట్ అయ్యి వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడినట్టు కనిపించింది.కానీ చివరకు రహానే చక్కటి సహకారం ఇవ్వడంతో కోహ్లీ తనదైన ఆటతీరు ప్రదర్శించాడు. ఛేజింగ్ లో తనకు సాటి లేదని నిరూపించాడు. 33వ సెంచరీ నమోదు చేశాడు. దాంతో చివరలో రహానే అవుట్ అయినప్పటికీ జట్టుని విజయతీరాలకు చేర్చాడు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *