Main Menu

ఆస్ట్రేలియా కెప్టెన్ గా కోహ్లీ ఎంపిక‌

Spread the love

ఆసీస్ ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. వ‌రుస‌గా రెండో సిరీస్ లో ఓటమి అంచుల్లో ఉంది. సొంత గ‌డ్డ‌పై ఇలాంటి ప‌రాభ‌వం గ‌తంలో ఎన్న‌డూ లేని కంగూరులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. సిడ్నీలో చివరి టెస్ట్ ని కైవ‌సం చేసుకుని క‌నీసం డ్రాతో గ‌ట్టెక్కాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒక్కడైన కో హ్లీని క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ప్రకటించింది. 2018 అత్యుత్తమ అంతర్జాతీయ వ‌న్డే జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులో ఆస్ట్రేలియా క్రికెట్లర్లు ఎవరికీ చోటు కల్పించకపోవడం గమనార్హం. కోహ్లీతో పాటు మరో ముగ్గురు టీమిండియా ఆట‌గాళ్ల‌కు ఈ జ‌ట్టులో చోటు కల్పించింది. భారత్ నుంచి రోహి త్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌కు స్థా నం లభించింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన‌ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్, భా రత్), రోహిత్ శర్మ ( భారత్), బెయర్ స్టో (ఇంగ్లాండ్), హెట్‌మెయర్ (వెస్టిండీస్), జాస్ బట్లర్ (వికెట్ కీపర్, ఇంగ్లాండ్), తిషారా పెరీరా (శ్రీలంక), రషీద్ ఖాన్ (అ ఫ్గానిస్తాన్), కుల్దీప్ యాదవ్ ( భారత్), ముస్తాఫిజుర్ రెహ్మన్ (బంగ్లాదేశ్), జస్ప్రీత్ బుమ్రా ( భారత్).






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *