Main Menu

ముకుంద్ అవుట్: రాహుల్ ఇన్

rahul
Spread the love

రెండో టెస్టులో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తుది జట్టులో ఉండే అవకాశాలున్నాయని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు. ‘కేఎల్‌ రాహుల్‌ మాకు ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. ఇప్పుడున్న ఓపెనర్లలో ఎవరో ఒకరు అతడికి దారి ఇవ్వాల్సిందే. గత రెండేళ్లలో అతడు జట్టుకు అందించిన సేవలు అమూల్యమైనవి. పునరాగమనానికి, టెస్ట్‌ క్రికెట్‌ మళ్లీ మొదలు పెట్టడానికి అతడు అర్హుడు’ అని కోహ్లీ అన్నాడు.

కేఎల్‌ రాహుల్‌ రాక ఖాయమే అయినా సాయంత్రం జరిగే జట్టు సమావేశం తర్వాత అతడి ఎంపికపై తుది నిర్ణయం వెల్లడిస్తామని కోహ్లీ పేర్కొన్నాడు. కొలంబో పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉందని చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించే సంగతి ఇప్పుడే చెప్పలేమన్నాడు. జట్టులో ఎవరెవరు ఉంటారో ముందే వెల్లడిస్తే ప్రత్యర్థికి ఆశ్చర్యంగా ఉండదన్నాడు. పిచ్‌పై ఫలితం వచ్చే అవకాశాలున్నాయని అది తమలో ఉత్సాహం నింపుతోందని పేర్కొన్నాడు.






Related News

dhoni

గుడ్ బై అంటున్న ధోనీ!

Spread the loveటీమిండియా స్టార్ ప్లేయ‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ కెరీర్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే టెస్టుల‌కు రిటైర్మెంట్Read More

bhajji-1438327057-800

మన‌సు దోచుకున్న భ‌జ్జీ

Spread the loveమాజీ ఏస్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. తాజాగా ఆయ‌న త‌న కామెంట్స్ తో అంద‌రినీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *