టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌..!

jadeja
Spread the love

రెండు టెస్ట్ విజ‌యానందం తీర‌క‌ముందే టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ ఆల్ రౌండ‌ర్ మీద వేటు ప‌డింది. మూడో టెస్టు మ్యాచ్ కి రవీంద్ర జ‌డేజా మీద నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణ‌యం తీసుకుంది. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. దీంతో పల్లెకెలె జరగనున్న మూడో టెస్టుకు అతడు దూరమయ్యాడు. 24 నెలల వ్యవధిలో జడేజా 6 అపరాధ (డీమెరిట్‌‌) పాయింట్లు తెచ్చుకోవడంతో ఐసీసీ నియమ నిబంధనల ప్రకారం అతడిపై చర్య తీసుకున్నారు. రెండు టెస్టులో అతడు 70 పరుగులు చేసి, ఏడు వికెట్లు పడగొట్టాడు. పల్లెకెలెలో మూడో టెస్టు ఈ నెల 12న ప్రారంభంమవుతుంది.

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో అతడు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. మూడో రోజు ఆటలో 58వ ఓవర్‌లో చివరి బంతి వేసిన జడేజా తన చేతిలోకి వచ్చిన బాల్‌ను బ్యాట్స్‌మన్‌ దిముత్‌ కరుణరత్నే వైపు విసిరాడు. అతడు క్రీజ్‌ వదలనప్పటికీ ప్రమాదకరంగా బంతిని విసిరినట్టు ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించారు. తాజా ఉల్లంఘనతో అతడు 6 అపరాధ పాయింట్లు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించించారు. అప్పుడు అతడికి 3 డీమెరిట్‌ పాయింట్లు వచ్చాయి.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *