Main Menu

ధావన్ ఫిట్, జడేజా డౌట్

Spread the love

కీలక సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. సఫారీల సొంత గడ్డ మీద సవారీ చేయాలని ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రాక్టీస్ లేకపోవడంతో కొంత సతమతం కావాల్సిన స్థితిలో ఉంది. దానికి తోడు ఆటగాళ్ల ఫిట్ నెస్ పెద్ద సమస్యగా మారుతోంది. కీలక ఓపెనర్ శిఖర్ ధావన్ స్వల్ప గాయం నుంచి కోలుకోవడం కొంత ఊరట. వాస్తవానికి తొలి టెస్టుకి అందుబాటులో ఉండడని భావించినప్పటికీ ధావన్ వేగంగా కోలుకుని, ఫిట్ నెస్ సాధించడం విశేషం. తొలి టెస్టులో అతను మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది.

అయితే ఆల్ రౌండర్ జడేజా మాత్రం జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన్ని స్థానిక ఆస్పత్రికి కూడా తరలించారు. దాంతో ఈ టూర్‌కు వచ్చేముందు చీలమండకు స్వల్ప గాయంతో ఇబ్బంది పడ్డ ధవన్‌ పూర్తిగా కోలుకున్నట్టు బీసీసీఐ ప్రకటించగానే సంత్రుప్తి చెందిన టీమిండియా ఫ్యాన్స్ కి జడేజా ఆరోగ్యం కొంత నిరాశ కలిగించింది. జ్వరం సమస్యే కాబట్టి కోలుకునే అవకాశాలున్నాయని ఆశిస్తున్నారు. కానీ తొలి టెస్టుకి మాత్రం అందుబాటులో ఉండే అవకాశం లేదని మేనేజ్ మెంట్ అంచనా వేస్తోంది.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *