Main Menu

ఐపీఎల్ మార్చేస్తున్నారు…

jadeja
Spread the love

రాజ‌కీయ వివాదాలు తీరం దాటుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. దాని ప్ర‌భావంతో ఐపీఎల్ లో మార్పుల‌కు రంగం సిద్ద‌మ‌వుతోంది. అందులో భాగంగా చెన్నైలో జ‌ర‌గాల్సిన త‌దుప‌రి మ్యాచ్ లోను మ‌రో వేదిక‌గా మార్చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దానికి స‌న్నద్ధంగా ఉన్నామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్ శుక్లా ప్ర‌క‌టించారు. చెన్నై మ్యాచ్ లోను పూణే త‌ర‌లిస్తామ‌ని తెలిపారు.

కావేరీ వివాదం నేప‌థ్యంలో చెన్నై కాక మీద ఉంది. దాని ప్ర‌భావం ఐపీఎల్ కి చేరింది. చివ‌ర‌కు తొలి మ్యాచ్ లో టీమిండియా ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజాపై ఫీల్డింగ్ చేస్తుండ‌గా షూ కూడా విసిరారు. అగంత‌కుడి నుంచి వ‌చ్చిన షూతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే జ‌డేజా మాత్రం స్పోర్టివ్ గా తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

అయిన‌ప్ప‌టికీ ఆందోళ‌న‌కారులు మాత్రం ఆగ‌డం లేదు. నిర‌స‌న‌లు తీవ్రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఐపీఎల్ ని అడ్డుకుని తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. దాంతో చివ‌ర‌కు ఐపీఎల్ యాజ‌మాన్యం దిగివ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. చెన్నైలో ప‌రిణామాల మూలంగా పూణే త‌ర‌లించే ప్ర‌య‌త్నం ప్రారంభించింది. అదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో కూడా ఇలాంటి ప్ర‌చారం మొద‌లు కావ‌డంతో ఐపీఎల్ షెడ్యూల్ మీద ప్ర‌భావం ప‌డుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.






Related News

france

రెండోసారి ఫ్రాన్స్

Spread the loveప్రపంచ సాక‌ర్ స‌మ‌రం ముగిసింది. ఘ‌నంగా నిర్వ‌హించిన ఈ టోర్నీలో ఫ్రాన్స్ విజేత‌గా నిలిచింది. రెండోసారి క‌ప్Read More

england-v-india-first-one-day-international_a5e6cd20-8606-11e8-a662-45bbb3f001dc

కూల్చేసిన కుల్దీప్, శ‌త‌క్కొట్టిన శ‌ర్మ‌

Spread the loveచైనామెన్ దెబ్బ‌కు బ్రిటీష్ బ్యాచ్ బెంబేలెత్తింది. ఇప్ప‌టికే టీ20 సిరీస్ లో రాణించిన కుల్దీప్ యాదవ్ చైనామెన్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *