Main Menu

ముందుకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లు

Spread the love

ఐపీఎల్ మ్యాచ్ లు ముందుకు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో మ్యాచ్ లు దాదాపు ప్లే ఆఫ్ దశకు వచ్చేశాయి. దాంతో ప్లే ఆఫ్ మ్యాచ్ లన్నీ గంట ముందే మొదలవుతాయి. మ్యాచ్‌ల సమయాలు మారనున్నాయి. ఇప్పటివరకూ ఐపిఎల్‌ లీగ్‌ రాత్రి మ్యాచ్‌లు 8.00 గం||ల నుంచి ప్రసారమౌతున్న సంగతి తెలిసిందే. కానీ ప్లే-ఆఫ్‌ మ్యాచ్‌లైన సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లను రాత్రి 8.00 గంటలకు బదులుగా రాత్రి 7.00 గంటలకే ప్రారంభించనున్నట్లు ఐపిఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా బుధవారం తెలియజేశారు.

లీగ్‌ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభమై ఆట ముగిసిన బహుమతుల ప్రదానం పూర్తయ్యేసరికి అర్థరాత్రి 11.45 నుండి 12.00 గంటల సమయమవుతున్న దృష్ట్యా ప్లే-ఆఫ్‌ మ్యాచ్‌ల సమయానికి బిసిసిఐ మార్పు చేయాల్సి వచ్చింది. ఒక్కోసారి వర్షం, ఇతరత్రా కారణాల వల్ల మ్యాచ్‌ ఆలస్యమైతే మరీ ఆలస్యమౌతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ప్లే-ఆఫ్‌ మ్యాచ్‌లు ఒక గంట ముందే ప్రారంభమైతే వీక్షకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని శుక్లా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లే-ఆఫ్‌ మ్యాచ్‌లను ఒక గంట సమయం ముందుకు జరపడం వల్ల భారతదేశంలో ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇతర దేశాల్లో మ్యాచ్‌లను వీక్షించే వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. సెమీఫైనల్‌, ప్లే-ఆఫ్‌ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌… ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగనుండగా… ఫైనల్‌ మ్యాచ్‌ ముంబయిలో జరగనుంది.






Related News

8 నెలల్లో కోహ్లీకిది ఆరోది

Spread the love ట్రెం‌‌ట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.Read More

రెండో రోజు బౌల‌ర్ల‌దే..!

Spread the loveతొలిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ రాణించారు. తొలిసారిగా మిడిలార్డ‌ర్ రాణించ‌డంతో జ‌ట్టు మంచి స్కోర్ సాధించింది. అయితేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *