Main Menu

ఐపీఎల్ ఇక్క‌డే..కార‌ణం ఏమంటే?

Spread the love

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) 12వ ఎడిషన్‌ మార్చిలోజరగనుంది. తొలుత ఎన్నికల నేపథ్యంలో వేదికలు మార్చే విషయం పరిశీలించిన బిసిసిఐ టోర్నీని ఒక నెల ముందుకు జరిపి ఇక్కడే నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ(సిఓఏ) మంగళవారం ధ్రువీకరించింది. ఎప్పటిలా ఏప్రిల్‌ మొదటి వారంలో కాకుండా మార్చి 23న ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని కమిటీ వెల్లడించింది. త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు.

సాధారణంగా అయితే ఏప్రిల్‌లో మొదలై మే చివరి వారంలో ముగుస్తుంది. ఈసారి మే 30న ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ సైతం ఆరంభం అవుతోంది. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం రెండు టోర్నీల మధ్య ఆటగాళ్లకు కనీసం 15 రోజుల విశ్రాంతి ఇవ్వాలి. అందుకే ముందుగా ఐపిఎల్‌ను ఆరంభిస్తున్నారు. రాష్ట్ర సంఘాలు, అధికారులతో సుదీర్ఘ చర్చల తర్వాత ఐపిఎల్‌ 2019 షెడ్యూలు విడుదల చేస్తామని బిసిసిఐ తెలిపింది. ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్‌ నిర్వహించారు. 2014లో కొన్ని మ్యాచ్‌లను దుబారుకు తరలించిన సంగతి తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో భద్రత కల్పించడం కష్టమ వుతుందని పొట్టి క్రికెట్‌ లీగ్‌ను విదేశాలకు తరలిస్తారని ఊహా గానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇప్పటికైతే ప్రాథ మిక వేదికలు అందరికీ తెలి సినవే. మ్యాచ్‌లు తర లించాల్సిన అవ సరం వస్తే బ్యాకప్‌ వేది కలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలను సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల ప్రక్రియ తేదీలు ప్రకటించిన తర్వాత సభలు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాకప్‌ వేదికలు ఎంచుకున్నాం’ అని వినోద్‌ రారు, డయానా ఎడుల్జీ నేతృత్వంలోని పాలకుల కమిటీ వెల్లడించింది. ఇంతకు ముందు 2010లో ఐపీఎల్‌ను మార్చిలో ఆరంభించారు.


Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *