Main Menu

కివీస్ పై మూడో జ‌ట్టు భార‌త్

Spread the love

చివరి వన్డేలో అంబటి రాయుడు సత్తా చాటాడు. కష్టసమయంలో జట్టును అదుకున్నాడు. రాయడు 90 పరుగులతో (113 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు)తో కివీస్‌ బౌలర్లపై అధిపత్యం చెలాయించాడు. విజరు శంకర్‌ (45 పరుగులు, 64 బంతుల్లో నాలుగు ఫోర్లు), హర్థిక్‌ పాండ్యా (45 పరుగులు, 22 బంతుల్లో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు) కూడా ప్రత్యర్థి బౌలర్లపై సత్తా చాటడంతో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు చేసింది. తరువాత లక్ష్య సాధనలో న్యూజిలాండ్‌ 44.1 ఓవర్లలోనే 217 పరుగులకు ఆలౌటయింది. భారత్‌ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో భారత్‌ ఈ సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. కివీస్‌ గడ్డపై టీమిండియా కొత్త రికార్డు నెలకొల్పింది. కివీస్‌లో 4-1లో వన్డే సిరీస్‌ గెలుచుకున్న మూడో జట్టుగా నిలిచింది. 1999-2000లో ఆస్ట్రేలియా, 2000-2001లో శ్రీలంక జట్లు కూడా 4-1తో వన్డే సిరీస్‌ గెలుచుకున్నాయి. భారత్‌ మూడో జట్టుగా నిలిచింది. అయితే భారత్‌ గతంలో 3-1తో కివీస్‌పై సిరీస్‌ గెలచుకుంది. ప్రస్తుత వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *