Main Menu

చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ కోసం ఇండియా!

Spread the love

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) 2032 ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ప్రపంచ క్రీడల మహాకుంభమేళాని నిర్వహించేందుకు అధికారికంగా తన ఆసక్తి ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వాన్ని సంప్రదించి ఐఓఏ సర్కార్ మద్దతు కోరనుంది. ఇంతకు ముందు భారత పర్యటనకు వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) చీఫ్ థామస్ బాక్ కి ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా 2032 ఒలింపిక్ నిర్వహణపై చర్చించడం జరిగింది. బాక్ భారత్ ఆలోచనను స్వాగతించారు.

2032 ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తి తెలుపుతూ భారత ఒలింపిక్ సంఘం సంబంధిత పత్రాలను ఐఓఏకి అందజేసింది. దీని తర్వాత ఐఓఏ డైరెక్టర్ రాజీవ్ మెహతా జాక్విలీన్ భారెట్ అధ్యక్షతలోని ముగ్గురు సభ్యుల బిడ్డింగ్ కమిటీని ఈ నెల ఆరంభంలో కలిశారు. భారత్ ఎప్పుడో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి ఉండాల్సిందని వారు చెప్పారు. ప్రస్తుతం ఐఓఏ ఉన్నతాధికారులంతా ఆతిథ్య నగరాలుగా ఢిల్లీ, ముంబైలను ముందుంచాలని భావిస్తున్నారు. అయితే దేశంలోని మిగతా నగరాలు కూడా పోటీలో నిలిచే అవకాశం ఉంది.

ఒలింపిక్స్ 2032 బిడ్డింగ్ ప్రక్రియ 2022లో ప్రారంభం అవుతుంది. ఆతిథ్య నగరం పేరు 2025లో ప్రకటిస్తారు. ఈ ఏడాది ఆసియా క్రీడలను విజయవంతంగా నిర్వహించిన ఇండోనేషియా కూడా ఒలింపిక్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ రేసులో చైనాకు చెందిన షాంఘై నగరం, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కూడా ఉండవచ్చు. ఉత్తర, దక్షిణ కొరియాలు సంయుక్తంగా ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి ప్రదర్శించవచ్చు. 2032 ఒలింపిక్స్ ను జర్మనీ 13 నగరాల్లో నిర్వహించాలనుకుంటోంది. 22 డిసెంబర్ న జరిగే ఐఓఏ సాధారణ సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వ మద్దతు కోరే ప్రతిపాదన పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *