క్రికెట్ రూల్స్ మారిపోయాయ్..

Australia_vs_India cricket
Spread the love

అంతర్జాతీయ క్రికెట్‌ నిబంధనల్లో మార్పులుకు ఐసిసి శ్రీకారం చుట్టింది. క్రికెట్‌లో ఇ ప్పటి వరకు కొత్త నిబంధనలు ఎన్నో అమలులో ఉన్నప్పటికీ వాటికి మరింత మెరుగులద్దారు. వాగ్వివాదాలు, ఇతర క్రమశిక్షణ రాహ్యితంపైన చర్యలు ఇందులో ప్రవేశ పెట్టారు. టెస్ట్‌, వన్డే, టి 20 ఫార్మాట్లకు 17 మార్పుల ఈ నెల 28 నుంచి తూచా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏడాది మే నెలలోనే ఈ అంశాలపై ఐసిసి కసరత్తు పూర్తి చేయగా, ఇప్పటికీ అమలుల్లోకి తీసుకువస్తున్నారు. 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక- పాక్‌ టెస్ట్‌ సిరీస్‌, ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో వన్డే, దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ టెస్ట్‌ సిరీస్‌కు వర్తింప చేయనున్నారు.

డిఆర్‌ఎస్‌ టి 20ల్లోను…

ఇప్పటి వరకు టెస్ట్‌లు,వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్‌ పున: సమీక్ష పద్దతి (డిఆర్‌ఎస్‌)ను ట్వింటీ 20ల్లోను కూడా ప్రవేశ పెడుతూ ఐసిసి నిర్ణయం తీసుకుంది. అలాగే టెస్ట్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత అదను రివ్యూలు అమలుకు ఐసిసి ముగింపు పలికింది. అంటే ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్యూలు కోరే అవకాశం ఉండదు. ఇక్కడ ప్రతీ ఇన్నింగ్స్‌లో రెండు అన్‌ సక్సెస్‌ పుల్‌ రివ్యూలను మాత్రమే వినియోగించుకునే వీలుంది.

రనౌట్లలో కీలక మార్పు:

మరొకవైపు రనౌట్‌ విషయంలో కీలక మార్పులకు ఐసిసి శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్‌మెన్‌ పరుగు తీసే సమయంలో డైవ్‌కోడుతూ బ్యాట్‌ను ముందుగా ఒకసారి గ్రౌండ్‌ను తాకి ఉంచి ఆ తర్వాత అదే బ్యాట్‌ గాల్లో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అదే సమయంలో వికెట్ల పడ్డప్పటికీ బ్యాట్స్‌మెన్‌ ముందుగా ఒకసారి క్రీజులో బ్యాట్‌ ఉంచడం వల్ల నాటౌట్‌గా సేఫ్‌ అవుతాడు.

క్రమశిక్షణా రాహిత్యానికి మూల్యం…

మ్యాచ్‌ జరిగే సమయంలో ఒక ఆటగాడు ఏ విధమైన చెడు ప్రవర్తనకు పాల్పడినా లెవెల్‌ 4 నిబంధన అమలు చేస్తారు. ఫీల్డ్‌లో ఒక క్రికెటర్‌ తో తారా స్థాయిలో వాగ్వాదం చేసినా, అంపైర్‌తో చెడుగా ప్రవర్తించినా ఇవన్నీ లెవెల్‌ 4 నిబంధన కిందకు వస్తాయి. అంటే అతిగా ప్రవర్తించిన ఆ ఆటగాడ్ని ఫీల్డ్‌ నుంచి బయటకు పంపిచడమే కాకుండా 4 నిబంధన కిందకు వస్తాయి. అంతకు ముందున్న ఐసిసి లెవెల్‌ 1 నుంచి 3 వరకు ఉన్న నిబంధనలు యథావిథిగా కొనసాగు తాయి.

బ్యాట్‌ మందంపై స్పష్టత..
బ్యాట్స్‌మెన్‌ రకరకాల సైజుల్లో బ్యాట్లు వాడటంపై విమర్శలు వినపిస్తున్న విషయం విదితమే. అయితే ఇక్కడ బ్యాట్‌ పొడవు, వెడల్పు విషయంలో ఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుపోగా , తాజా నిబంధన ప్రకారం బ్యాట్‌ ఓవరాల్‌ మందం మాత్రం 67 ఎంఎంకు మించకూడదు. అదే సమయంలో బ్యాట్‌ అంచు మందం మాత్రం 40 ఎంఎంను దాటి ఉండకూడదనే నిబంధనను ప్రవేశపెట్టింది.


Related News

hockey'

మట్టికరిచిన పాక్

Spread the loveపాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్నిRead More

kumble

అనిల్ కుంబ్లేని అవమానించారు..

Spread the loveటీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేను బీసీసీఐ ఘోరంగా అవమానించింది. సహచరులంతా ముద్దుగా జంబోగా పిలుచుకునే అనిల్ కుంబ్లేRead More

 • పాకిస్తాన్ ని మట్టికరిపించి ముందంజ
 • టీమిండియాలో ఠాకూర్
 • టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అనుమతి
 • ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు
 • టీమిండియా విజయం
 • టీమిండియా ఘన విజయం
 • అనుమానంగా ఆసీస్ కెప్టెన్
 • పెళ్ళి పీటలపైకి టీమిండియా ఫాస్ట్ బౌలర్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *