Main Menu

టాప్ లో టీమిండియా

Spread the love

తాజా ర్యాంకింగ్స్ లో టీమిండియాకు తిరుగు లేదు. కెప్టెన్ కోహ్లీ కూడా అదే రేంజ్ లో సాగుతున్నాడు. వ‌రుస‌గా రాణిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు అంద‌ని స్థాయికి చేరుతున్నాడు. యంగ్ స్టార్లు కూడా ర్యాంకింగ్స్ లో ఎగ‌బాకుతున్నారు. విండీస్ తో జ‌రిగిన సిరీస్ లో విశేషంగా రాణించిన టీమిండియా యువ సంచలనాలు పృథ్వీషా, రిషబ్‌ పంత్‌ ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ ఎగబాకారు. ఆటలోనే కాదు ర్యాంకుల్లోనూ తమదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు.

ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ పది స్థానాలకు పైగా ఎగబాకారు. బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ 935 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతు న్నాడు. ఇక హైదరాబాద్‌ టెస్టులో 70, 33 నాటౌట్‌తో నిలిచిన పృథ్వీ షా 13 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంకులో నిలిచాడు. అరంగేట్రంలోనే శతకం బాదిన షా అంతకుముందు 73వ స్థానంతో ఉన్నాడు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో నిలిచాడు. జట్లపరంగా భారత్‌ 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా… దక్షిణాఫ్రికా(106), ఆస్ట్రేలియా(106), ఇంగ్లండ్‌(105) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.






Related News

మ‌ళ్లీ నోరుపారేసుకున్న షాహిద్ ఆఫ్రిదీ

Spread the loveపాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ ఆఫ్రీది మ‌రోసారి నోటికి ప‌నిచెప్పారు. గ‌తంలో కూడా త‌న నోటి దురుసుతోRead More

రేటింగ్స్ లో మ‌నోళ్లే టాప్

Spread the loveఅంత‌ర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ఆట‌గాళ్లు అద‌ర‌గొడుతున్నారు. ర్యాంకింగ్స్ లో స‌త్తా చాటుతున్నారు. లేటెస్ట్ రేటింగ్స్ లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *