టీమిండియా విజయం

hockey'
Spread the love

బంగ్లాదేశ్‌ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియాకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. నేడు (బుధవారం) జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5-1తో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ తొలి అర్థ భాగం నుంచి చివరి వరకు భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని చలాయించారు. భారత ఆటగాడు ఎస్‌వీ సునీల్‌ మూడో నిమిషంలో తొలి గోల్‌ సాధించగా.. జపాన్‌ ప్లేయర్‌ కెంజి కిటజటో నాలుగో నిమిషంలో గోల్‌ సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుంతుండగా భారత ఆటగాడు లలీల్‌ ఉపాధ్యాయ 22 నిమిషంలో గోల్‌ సాధించాడు. దీంతో భారత్‌ 2-1 తో ఆధిక్యం సాధించింది.

ఆ తర్వాతా భారత ఆటగాళ్లు జపాన్‌కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించారు. రమణ్‌దీప్‌ సింగ్‌ 33 నిమిషంలో మరో గోల్‌ సాధించగా.. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 35వ, 48 నిమిషాల్లో వరుస గోల్స్‌ సాధించడంతో భారత్‌ విజయం సులువైంది. ఇటీవలె భారత హాకీ జట్టుకు కొత్త కోచ్‌ స్జోయెర్డ్ మరిజ్నేను నియమించిన విషయం తెలిసిందే‌. ఇక భారత్‌ తరువాతి మ్యాచ్‌ ఆతిథ్య బంగ్లాదేశ్‌తో శుక్రవారం తలపడనుంది.






Related News

Kanpur: Mohammed Siraj of Sunrisers Hyderabad during an  IPL match against Gujarat Lions in Kanpur on Saturday. PTI Photo(PTI5_13_2017_000116B)

హైదరాబాదీకి అరుదైన అవకాశం

Spread the loveహైదరాబాద్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు భారత టి-20 జట్టులో చోటు లభించింది. అదేRead More

hockey'

మట్టికరిచిన పాక్

Spread the loveపాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్నిRead More

  • అనిల్ కుంబ్లేని అవమానించారు..
  • పాకిస్తాన్ ని మట్టికరిపించి ముందంజ
  • టీమిండియాలో ఠాకూర్
  • టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అనుమతి
  • ఆసీస్ ఆటగాళ్లపై రాయి విసిరిందెవరు
  • టీమిండియా విజయం
  • టీమిండియా ఘన విజయం
  • అనుమానంగా ఆసీస్ కెప్టెన్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *