Main Menu

పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు

elli_hardik_1516715044398
Spread the love

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆన్ ఫీల్డ్ తో పాటు ఆఫ్ ఫీల్డ్ లోనూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కోహ్లీకి త‌గ్గ‌ట్టుగానే ఈ యంగ్ స్టార్ కూడా అప్పుడే డేటింట్ వ్య‌వ‌హారాల‌తో టాప్ స్టోరీస్ లో క‌నిపిస్తున్నాడు. తాజాగా మ‌రోసారి స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్‌తో షికార్ చేస్తూ కెమెరా కంట‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే త‌న అన్న‌య్య కృనాల్ పెళ్లితో ఎల్లీతో క‌లిసి క‌నిపించిన పాండ్యా, ఇప్పుడు మ‌రోసారి హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో నెట్ లో వారి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి బాయ్.. బాయ్ చెప్పేసినట్లు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు ఈ క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్ జట్టుతో ముఖాన్ని కప్పిఉంచే ప్రయత్నం చేయడం కెమెరా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఎల్లీ ఇవ్రామ్ గ‌తంలో బిగ్ బాస్ లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా క‌నిపిస్తోంది. దాంతో కోహ్లీని ఫాలో అవుతూ మ‌రో హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తుండ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.






Related News

Australia-v-England-Game-2

వ‌ర‌ల్డ్ రికార్డ్: ఆసీస్ ని అల్లాడించిన ఇంగ్లాండ్

Spread the loveమూలిగే న‌క్క‌పై తాటికాయ‌ప‌డ్డ‌ట్టుగా మారుతోంది. అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లుRead More

rohit-sharma-scored-his-17th-o

రోహిత్ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే

Spread the loveఇంగ్లాండ్ తో సిరీస్ కి బ‌య‌లుదేరే ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్ల ప‌రిస్థితి ఢోలాయ‌మానంలోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *