Main Menu

మన‌సు దోచుకున్న భ‌జ్జీ

Spread the love

మాజీ ఏస్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కారు. తాజాగా ఆయ‌న త‌న కామెంట్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా మ‌తానికి సంబంధించి సాగుతున్న రాజ‌కీయాల ప‌ట్ల ఆయ‌న వైఖ‌రి ప్ర‌క‌టించి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నారు. ఈ టీమిండియా టర్బోనేటర్‌ క్రికెట్‌ అంశాలే కాదు సామాజిక సమస్యలపైనా ముక్కుసూటిగా మాట్లాడతాన‌ని నిరూపించాడు. తాజాగా మరోసారి ట్వీట్టర్‌లో ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన హర్బజన్‌ సింగ్‌.. ఈ సారి ఫిఫా ప్రపంచకప్‌ను తీసుకొని మనోన్మాదులపైకి దూస్రా సంధించాడు. 1991లో ఉద్బవించిన ఓ దేశం, కనీసం 50 లక్షల జనాభా కూడా లేని ఓ దేశం ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడుతోంది, మనమేమో హిందూ ముస్లింలు అంటూ ఆడుకుంటున్నామని భజ్జీ అన్నాడు. ‘ 50 లక్షల జనాభా ఉన్న క్రోయేషియా ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడుతోంది. 135 కోట్ల జనాభా ఉన్న మనం హిందూ-ముస్లిం అంటూ ఆడుకుంటున్నాం. ఆలోచనలు మారితే దేశం మారుతుంది’ అంటూ హర్భజన్‌ రాసుకొచ్చాడు.






Related News

టాప్ లోనే కింగ్ కోహ్లీ

Spread the loveఅంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్‌ కోహ్లీRead More

కోహ్లీ సేన కొత్త రికార్డులు

Spread the love ఆస్ట్రేలియాతో జరిగిన ఇక్కడ జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *