Main Menu

మాక్స్ వెల్ కి స‌మ‌ర్ప‌యామి..!

Spread the love

రెండు టీ20 మ్యాచ్ లో సిరీస్ లో టీమిండియా త‌ల‌వంచింది. మ్యాక్స్ వెల్ ముందు మోక‌రిల్లింది. టీమిండియా బౌల‌ర్లు ఈ ఆసీస్ బ్యాట్స్ మెన్ కి దాసోహం అయ్యారు. పేస్, స్పిన్ తేడా లేకుండా విరుచుకుప‌డిన మ్యాక్స్ వెల్ రెండు మ్యాచ్ ల‌లోనూ అరివీర‌భ‌యంక‌రంగా రెచ్చిపోయాడు. రెండో మ్యాచ్ లో అయితే ఏకంగా సెంచ‌రీతో చెల‌రేగి సిరీస్ ఆసీస్ ప‌రం చేసేశారు.

దాంతో తొలిసారిగా ఓ సిరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓట‌మి పాల‌య్యింది. విశాఖ‌, చెన్నై టీ 20ల‌లో ప‌రాజ‌యంతో కోహ్లీ సేన పై సొంత గ‌డ్డ‌పై ఓట‌మికి ఫించ్ టీమ్ ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్ట‌య్యింది.

ఇక రెండో మ్యాచ్ లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. లక్ష్య ఛేదనకు ఆసీస్ జట్టు లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ (113, నాటౌట్), డీఆర్సీ షార్ట్ (40), పీటర్ హాండ్స్‌కాంబ్ (20, నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో విజయ్ శంకర్‌కు 2, సిద్ధార్ థ కౌల్‌కు 1 వికెట్ లభించింది.

లక్ష్య ఛేదన దిగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. కేవలం 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఇది టీ20ల్లో మ్యాక్స్ వెల్‌కిదిరెండో టీ20 సెంచరీ.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయ 190 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు చెలరేగి ఆడారు. మొదటి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ ఈ మ్యాచ్ లోనూ కంగారులను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 61 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో రాహుల్ (47) కౌల్టర్‌నైల్ బౌలింగ్ లో రిచర్డ్‌సన్‌కి క్యాచ్ ఇచ్చి త్రుటిలో అర్ధ సెంచరీ చేజార్చుకు న్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి తనదైన శైలిలో ఆడాడు. ఈ దశలో ధావన్ (14) బెహ్రెన్‌డార్ ఫ బౌలింగ్‌లో స్టొయనిస్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (1) ఇలా వచ్చి అలా వెళ్లడంతో అప్పటికీ 3 వికెట్లు కోల్పోయ 74 పరుగులు చేసింది. రిషభ్‌పంత్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ మొదట నెమ్మదిగా ఆడిన ఆ తర్వాత కోహ్లీతో కలిసి భారీ షాట్లు ఆడాడు. విశాఖ మ్యాచ్‌లో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ధోనీ ఈ మ్యాచ్‌లో అలాంటి అవకాశమివ్వలేదు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ బౌండ రీలతో చెలరేగుతూ కేవలం 29 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు ధోనీ (40) కేవలం 23 బంతుల్లోనే మూడు సిక్సర్లతో బౌలర్లపై దాడికి దిగినా, చివరి ఓవర్‌లో కమిన్స్ బౌలింగ్‌లో పింఛ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (8) రెండు ఫోర్లతో ఆ కట్టకున్నాడు. అప్పటికీ పూర్తి ఓవ ర్లు ఆడిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయ 190 పరుగులను చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్, కౌల్టర్‌నైల్, కమిన్స్, షార్ట్‌కు తలో వికెట్ లభించింది.


Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *