Main Menu

ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్

Spread the love

టీమిండియా మాజీ ఓపెన‌ర్ గౌత‌మ్ గంభీర్ కాస్త ముక్కుసూటి మ‌నిషి. ఆన్ ఫీల్డ్ లోనే కాకుండా ఆఫ్ ఫీల్డ్ లో కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటాడు. అందులో భాగంగా తాజాగా మాజీ పాక్ క్రికెట్ స్టార్ షాహిద్ ఆఫ్రిదీ పై ఘాటు ట్వీట్ చేశారు. క‌శ్మీర్ ప‌రిణామాల‌పై ఆఫ్రీదీ ట్వీట్ కి గంభీర్ స‌మాధానం చెప్పాడు. కశ్మీర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని ఆఫ్రిది డిమాండ్ చేశాడు.

దాంతో అత‌డికి గంభీర్ త‌గిన రీతిలో కౌంట‌ర్ ఇచ్చాడు. అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని ఈ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ కెప్టెన్‌ సెటైర్‌ వేశాడు. ‘అఫ్రిది ట్వీట్‌పై స్పందించాలని మీడియా ప్రతినిధులు నాకు ఫోన్‌ చేస్తున్నారు. బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి ఆనందపడుతున్నాడు.’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

గ‌డిచిన కొన్నివారాలుగా క‌శ్మీర్ లో ప‌రిణామాలు ఆందోళ‌న‌క‌రంగా మారుతున్నాయి. అటు మిలిటెంట్లు, ఇటు భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య సామాన్యులు స‌మిధ‌ల‌వుతున్నారు. తాజాగా కాల్పుల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్ల మ‌ధ్య ట్వీట్ల వార్ ఆస‌క్తిగా మారుతోంది.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *