Main Menu

మ‌ళ్లీ ధోనీ..!

Spread the love

ధోని శకం ముగిసిందనుకున్న వారికి చేదువార్త. స్వదేశంలో విండీస్‌తో సిరీస్‌, ఆస్ట్రేలియాతో టీ20 సిరీసుల్లో చోటు దక్కని ధోనికి ఆసీస్‌తో వన్డేల్లో చోటు దక్కింది. అంతేగాక న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20 సిరీస్‌కు మహేంద్ర సింగ్‌ ధోనిని ఎంపిక చేస్తూ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం జట్టును ప్రకటించింది. దీంతో మిస్టర్‌ కూల్‌ మళ్లీ బ్యాట్‌కు పనిచెప్పనున్నాడు. 2020 టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు మెరుగైన అవకాశాలు ఇవ్వటం కోసమని ఎం.ఎస్‌.ను పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన భారత సెలక్టర్లు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. విండీస్‌, ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరమైన సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఈ రెండు సిరీస్‌లకు సిద్ధం కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

37ఏళ్ల ధోని స్థానంలో జట్టులోకి వచ్చిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో రిషబ్‌ పంత్‌ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి రానున్నాడు. గాయంతో దూరమైన హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌లకు రెండు సిరీస్‌ల్లో చోటు దక్కింది. ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు జనవరి 13 నుంచి ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల్లో తలపడనుంది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ఆడిన కృనాల్‌ పాండ్యాపై వేటు పడింది. ఇక ఫిబ్రవరిలో కోహ్లీసేన కివీస్‌తో మూడు టీ20లు ఆడనుంది. ప్రపంచకప్‌ సన్నాహకంలో భాగంగా జరిగే ఈ సిరీస్‌లు భారత ఆటగాళ్లకు కీలకం కానున్నాయి.

కివీస్‌తో టీ20లకు…
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్లు), హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, రవీంద్రు జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమీ.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డేలకు…
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, కుల్దీ ప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, రవీంద్రు జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ షమీ.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *