Main Menu

ఆసీస్ ఏకపక్ష నిర్ణయం: బీసీసీఐ ససేమీరా!

Spread the love

క్రికెట్ లో మరో ఆసక్తికర అంశం ముందుకొచ్చింది. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ దానికి మూలంగా ఉంది. ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్న టీమిండియా సిరీస్ లో భాగంగా ఓ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ని షెడ్యూల్ లో ఖరారు చేశారు. కానీ దానికి బీసీసీఐ ససేమీరా అంటోంది. దాంతో ఇది ఆసక్తిగా మారుతోంది.

డిసెంబరు 6-10న ఆసీస్‌-భారత్‌ మధ్య డే నైట్‌ టెస్టు మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. ఇటీవల న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ దేశాల్లో డేనైట్‌ టెస్టులు విజయవంతమైన నేపథ్యంలో ఆడిలైడ్‌లో ఒక డే నైట్‌ టెస్టు నిర్వహిస్తున్నట్లు సిఎ ప్రకటించింది. ఈ మేరకు నాలుగు టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, టీ20, వన్డే, టెస్టుల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

నవంబరు 21న గబ్బాలో మొదటి టీ20, 23న మెల్‌బోర్నోలో రెండో టీ20, 25న సిడ్నీలో మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. తర్వాత డిసెంబర్‌ 6న మొదటి టెస్టు ఆడిలైడ్‌లో జరగనుండగా, రెండో టెస్టు 14న పెర్త్‌లో ప్రారంభం కానుంది. మూడో టెస్టు డిసెంబర్‌ 26న(బాక్సింగ్‌ డే) మెల్‌బోర్నోలో, నాలుగో టెస్టు జనవరి 3-7న ముగుస్తుంది. అనంతరం మూడు వన్డేలు ప్రారంభం కానున్నాయి. మొదటి వన్డే జనవరి 12న సిడ్నీలో, రెండో వన్డే జనవరి 15న ఆడిలైడ్‌లో, మెల్‌బోర్నోలో జనవరి 18న జరిగే మూడో వన్డేతో ఈ సీరిస్‌ ముగియనుంది.

ఈ మూడు సీరిస్‌ల్లో కంగారు కీలక ఆటగాళ్లు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆడటం లేదు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ఏడాది పాటు నిషేధం విధించిన విషయం విదితమే. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్‌ భారత్‌తో వన్డే సీరస్‌ నుండి అందుబాటులో ఉండనున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) ఇప్పటివరకు డే నైట్‌ టెస్టులను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ సభ్యులు ఈ విషయంలో భారత్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రోజువారీ టెస్టు క్రికెట్‌ యొక్క భవిష్యత్తు, బూమ్‌ టెలివిజన్‌ రేటింగ్స్‌, రికార్డు సమూహాలు ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు ఇదే ఏకైక మార్గమని సిఎ చెబుతోంది.






Related News

టాప్ లో టీమిండియా

Spread the loveతాజా ర్యాంకింగ్స్ లో టీమిండియాకు తిరుగు లేదు. కెప్టెన్ కోహ్లీ కూడా అదే రేంజ్ లో సాగుతున్నాడు.Read More

స్టేడియంలోనే కోహ్లీకి ముద్దు

Spread the loveటీమిండియా కెప్టెన్ కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌య్యింది. విండీస్ తో హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *