Main Menu

క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్

Spread the love

బాల్ ట్యాంప‌రింగ్ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఆసీస్ జ‌ట్టులో ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లపై వేటు ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దాంతో ఇప్ప‌టికే స్మిత్ త‌న త‌ప్పుని అంగీక‌రించారు. ఆయ‌న‌కు తోడుగా తాజాగా డేవిడ్ వార్న‌ర్ కూడా మీడియా ముందుకు వ‌చ్చి క‌న్నీరు పెట్టుకున్నారు. స్మిత్ బాట‌ను అనుస‌రించారు.

తాను దేశ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చాల‌నుకోలేద‌ని వార్న‌ర్ ప్ర‌క‌టించారు. త‌న త‌ప్పున‌కు ఖ‌చ్చితంగా జీవితాంతం చింతించాల్సి వ‌స్తుంద‌ని వాపోయారు. ఆసీస్ జ‌ట్టు మాజీ వైస్ కెప్టెన్ వార్న‌ర్ జీవిత‌కాలం బాధ్య‌త‌ల‌కు అనర్హుడ‌ని ఇప్ప‌టికే క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో ఏడాది పాటు నిషేధానికి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో కాప్ టౌన్ టెస్టులో జ‌రిగిన ప‌రిణామాల‌పై తీవ్రంగా క‌ల‌త‌చెందిన‌ట్టు ప్ర‌క‌టించాడు.

అదే స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు క్రికెట‌ర్లు ఆసీస్ ఆట‌గాళ్ల‌పై తీసుకున్న చ‌ర్య‌ల‌పై సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద శిక్ష‌గా పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రుస‌గా స్మిత్, వార్న‌ర్ వంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు క‌న్నీరు పెడుతున్న తీరు పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *