సౌతాఫ్రికాకి ఎదురుదెబ్బ: స్టెయిన్ అవుట్

dale styan
Spread the love

ప్రపంచ క్రికెట్‌లో మేటీ పేసర్‌. సఫారీ క్రికెట్‌ విజయాల్లో కీలక పాత్రధారి. గాయంతో ఏడాదికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని భారత్‌తో ఫ్రీడం సిరీస్‌లో అడుగుపెట్టాడు. తొలి టెస్టు తొలి రోజు శిఖర్‌ ధావన్‌, తర్వాతి రోజు వృద్దిమాన్‌ సాహాలను అవుట్‌ చేసిన స్టెయిన్‌ పునరాగమనంలో తనలోని పేస్‌ సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కానీ పునరాగమనంలో తొలి మ్యాచ్‌లోనే మళ్లీ గాయాల పాలవుతాడని ఎవరు మాత్రం ఊహిస్తారు.

కానీ డెల్‌ స్టెయిన్‌ విషయంలో దురదృష్టశావత్తూ అదే జరిగింది. రెండో రోజు బౌలింగ్‌ వేసేందుకు రనప్‌ సమయంలో స్టెయిన్‌ గాయానికి గురయ్యాడు. ఎడమ కాలి మడమ పట్టేసింది. దీంతో బంతి వేయకుండానే స్టెయిన్‌ మైదానం వీడాడు. స్కాన్‌, ఎక్స్‌రే రిపోర్టులు పరిశీలించిన దక్షిణాఫ్రికా వైద్య బృందం స్టెయిన్‌కు 4-6 వారాల విశ్రాంతి అవసరమని తెలిపింది. దీంతో స్టెయిన్‌ అధికారికంగా తొలి టెస్టుకు మాత్రమే కాదు అనధికారికంగా సిరీస్‌ మొత్తానికీ దూరమయ్యాడు. చీలమండ వైద్య నిపుణులను సంప్రదించి అవసరమైతే వేగవంతమైన రికవరీ కోసం శస్త్రచికిత్సకూ వెళ్లేందుకు క్రికెట్‌ దక్షిణాఫ్రికా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘స్టెయిన్‌ ఇప్పుడే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాడు. మళ్లీ ఇలా కావటం బాధగా ఉంది. ఇది మంచి పరిణామం కాదు. స్టెయిన్‌ లేకపోయినా మేం విజయం కోసమే పోరాడుతామని’ అని మరో సీమర్‌ కగిసో రబాడ తెలిపాడు.

ఇప్పటికే ఏడాదికిపైగా విరామం, మళ్లీ గాయంతో స్టెయిన్‌ కెరీర్‌ ముగిసినట్టేనని అభిప్రాయం వినిపిస్తోంది. కానీ మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో లేదంటే భారత్‌తోనే పరిమిత ఓవర్ల పోటీకి స్టెయిన్‌ తిరిగి వస్తాడని సీఎస్‌ఏ దీమా వ్యక్తం చేస్తోంది.


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the loveటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the loveనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *