కోహ్లీ మరో ఘనత

kohli team india
Spread the love

కెప్టెన్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఐసీసీ రికార్డ్స్ లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనీకి మాత్రమే సాధ్యమయిన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. దాంతో జట్టు కెప్టెన్ గా ఉద్దండుల సరసన నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఒకే ఏడాది వన్డే, టెస్ట్ టీమ్ లకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన అవార్డుల జాబితాలో కోహ్లీకి క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డులు దక్కాయి.

అంతేగాకుండా ఉత్తమ ఐసీసీ టెస్టు, వన్డే జట్ల సారథ్య పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఒక ఏడాదిలో 900 పాయింట్లు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. తద్వారా ఎనిమిదేళ్ల తర్వాత ఒకే ఏడాదిలో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు సారథిగా ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2009లో ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ధోని సారథిగా ఎంపికవ్వగా, తాజాగా ఆ ఘనతను కోహ్లి సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే ఒకే ఏడాదిలో రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైన మూడో ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందాడు. 2004, 2007 ఏడాదిలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు ఎంపికవ్వగా… ఆపై భారత్‌ నుంచి ధోని, కోహ్లిలు మాత్రమే ఆ ఘనతను సాధించారు.

మరో పక్క భారత యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్‌ ఐసీసీ టీ20 ఫర్‌ఫామెన్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 25 పరుగులిచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు గాను చాహల్‌ ఈ అవార్డు అందుకున్నాడు.

ఐసీసీ అవార్డు విజేతల వివరాలు…
– ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)
– ఐసీసీ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- రషీద్‌ ఖాన్‌(అఫ్ఘనిస్తాన్‌)
– ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – హసన్‌ అలీ (పాకిస్తాన్‌)
– ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- మరాయిస్‌ ఎర్మర్సస్‌(దక్షిణాఫ్రికా)


Related News

VIRAT-KOHLI

వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అదో సంచ‌ల‌నం అవుతోంది. గ్రౌండ్ లో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోRead More

kohli team india

కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌

Spread the loveసుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన క్రికెట్ లో కోహ్లీ ఖ్యాతి రోజురోజుకి పెరుగుతోంది. ఐసీసీ చ‌రిత్ర‌లో కింగ్ కోహ్లీRead More

 • కోహ్లీ కొత్త చరిత్ర
 • ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ
 • కోహ్లీ సేన కొత్త చ‌రిత్ర‌..
 • దక్షిణాఫ్రికాకు మరో దెబ్బ
 • టీమిండియా సంచలన విజయం
 • దక్షిణాఫ్రికాకి గట్టి దెబ్బ
 • చెలరేగిన కోహ్లీ, బారత్ బోణీ
 • పాక్ ని మట్టికరిపించిన యువభారత్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *