దీనస్థితిలో సనత్ జయసూర్య

jayasuriya
Spread the love

జయసూర్య. క్రికెట్ లో ఆ పేరే ఓ సంచలనం.. శ్రీలంక క్రికెట్ చరిత్రలో పెను ప్రకంపనం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన ఆటగాడు. ఎడం చేతి వాటం బ్యాటింగ్, బౌలింగ్ తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆటగాడు. అలాంటి ప్రఖ్యాత ఆటగాడు. 1990 దశకం చివరిలో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చివరకు నడవలేని స్థితిలో నానా ఇక్కట్లు పడుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ లో బౌలర్లకు చుక్కలు చూపించి బ్యాటింగ్‌తో అదరగొట్టే జయసూర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్ట్రెచర్స్‌లేనిదే అడుగులు ముందుకు వేయని పరిస్థితికి చేరుకున్నాడు. మోకాలి సమస్యతో దయనీయంగా కనిపిస్తున్నాడు. అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నాడు. ప్రధానంగా మోకాలి సమస్య నుంచి బయటపడేందుకు త్వరలోనే ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్‌ వెళ్లే ఆలోచన చేస్తున్నాడు. మోకాలికి శస్త్రచికిత్స కోసం ప్రయత్నిస్తున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం జయసూర్య శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు రెండుసార్లు సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశాడు.

అయితే స్టేడియంలో సిక్సర్ల హోరు వినిపించిన జయసూర్య స్థితి చూసి చాలామంది నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. అతడి పరిస్థితి చూసి అయ్యో అనాల్సి వస్తోంది.


Related News

pujara vijay

చేతులెత్తేసిన టీమిండియా

Spread the loveరెండో టెస్టులోనూ టీమిండియా చేతులెత్తేసింది. పేసర్ల దాటికి విలవిల్లాడింది. సునాయాసంగా బ్యాటింగ్ చేయడానికి తగ్గట్టుగా పిచ్ అనుకూలిస్తున్నాRead More

team india

టీమిండియా కూర్పుపై ఆగ్రహం

Spread the loveతొలిటెస్టులో రహానేకి బదులుగా రోహిత్ శర్మను తీసుకోవడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చిన టీమిండియా రెండో టెస్టులోRead More

 • టీమిండియాకి గుణపాఠాలు
 • సౌతాఫ్రికాకి ఎదురుదెబ్బ: స్టెయిన్ అవుట్
 • దీనస్థితిలో సనత్ జయసూర్య
 • హార్థిక్ పాండ్యా ఒంటరిపోరు, అయినా..
 • ధోనీ గ్రేడ్ పడిపోతోంది..
 • ధావన్ ఫిట్, జడేజా డౌట్
 • కొట్టి తీరతామంటున్న కోహ్లీ
 • ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *