Main Menu

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the love

రికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. అందులో భాగంగా ద్వైపాక్షిక సిరీస్ లో నాలుగో మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. సెయింట్‌ జార్జ్‌లో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఫోర్లు, సిక్స్‌ల మోత మోగిస్తూ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 418 పరు గుల భారీ స్కోరు సాధించింది. జోస్‌ బట్లర్‌ (150, 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), మోర్గాన్‌ (103, 88 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకాలు సాధిం చారు. బట్లర్‌, మోర్గాన్‌ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. ఓపెనర్లు హేల్స్‌ (82), బెయిర్‌స్టో (56) మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 24 సిక్స్‌లు కొట్టిన ఇంగ్లండ్‌ ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా నిలిచింది.

వెస్టిండీస్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (23)ను బద్దలు కొట్టింది. ఈ సిరీస్‌లోనే ఇంగ్లాం డ్‌తో తొలి వన్డేలో విండీస్‌ ఈ రికార్డును నెలకొ ల్పింది. అలాగే వన్డేల్లో 400పై స్కోరు సాధించడం ఇంగ్లాండ్‌కు ఇది నాలుగోసారి. అనంతరం 419 పరుగుల విజయ లక్ష్యంతో బరి లోకి దిగిన విండీస్‌ 389 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే విండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో ఏకంగా 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 14 సిక్సర్లు కొట్టిన గేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. గేల్‌ టెస్టుల్లో 98 సిక్సర్లు కొట్టగా, వన్డేల్లో 305, టీ20ల్లో 103 సిక్సర్లు నమో దు చేశాడు. ఈ మ్యాచ్‌లో గేల్‌ 55 బంతుల్లోనే సెంచరీ చేశాడు. విండీస్‌కు ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. 1999లో బంగ్లాదేశ్‌పై బ్రియాన్‌ లారా 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓడిన జట్టు బ్యాట్స్‌మన్‌ చేసిన ఫాస్టెస్ట్‌ సెంచరీల్లో ఇది రెండోది. గతంలో 54 బంతుల్లోనే జానీ బెయి ర్‌స్టో సెంచరీ చేసినా ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. పది వేల పరుగులు సాధించిన రెండో విండీస్‌ ఆటగాడిగా, అంతర్జాతీ యంగా 14వ ఆటగాడిగా గేల్‌ ఘనత అందుకు న్నాడు.

అలాగే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో మొత్తంగా 46 సిక్స్‌లు కొట్టాయి. వన్డేల్లో ఇది ఒక రికార్డు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఇరు జట్లు 807 పరుగులు చేశాయి. ఈ విషయంలో ఇది మూడో స్థానంలో ఉంది. కాగా, నాలుగో వన్డేలో విజయం తో ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.






Related News

ఆ ముగ్గురే ఏ ప్ల‌స్

Spread the loveటీమిండియా ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ గ్రేడ్లు ప్ర‌క‌టించింది. వాటి ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రెమ్యునేష‌న్ అందిస్తారు. అయితే ఈసారి జాబితాలోRead More

ఒక్క మ్యాచ్ లో ఎన్ని రికార్డులో..!

Spread the loveరికార్డుల ప‌రంప‌ర సాగుతోంది. విండీస్, ఇంగ్లాండ్ సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హోరాహోరీ పోరులో బ్యాట్స్ మెన్లు ప‌రుగులRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *