ప్రయోగాలకు సిద్దమవుతున్న కోహ్లీ

team india
Spread the love

టీమిండియాలో పలు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. చివరి వన్డే కోసం కోహ్లీ సన్నాహాలు షురూ చేశారు. రిజర్వ్ బెంచ్ కి అవకాశాలు ఇవ్వడానికి సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ లో కొందరికి అవకాశం ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా సీనియర్లకు రెస్ట్ ఖాయంగా మారింది. టీ20 సిరీస్ కి ముందు సీనియర్లకు విరామం ఖాయమని చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా గడ్డపై 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా కోహ్లీ సేన దక్షిణాఫ్రికాను ఖంగు తినిపించింది. దాంతో చివరి మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ తో ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. ఆరో వన్డేలో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. సిరీస్‌లో జట్టులో చోటు దక్కని ఆటగాళ్లను నామమాత్రమైన ఆరో వన్డేలో బరిలోకి దించి అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *