Main Menu

క‌న్న‌డ హీరోయిన్ తో సంబంధంపై చాహ‌ల్ ..

Spread the love

క‌న్న‌డ హీరోయిన్ తో టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. త్వ‌ర‌లో పెళ్లి ఖాయ‌మ‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దాంతో చివ‌ర‌కు ఈ యంగ్ స్పిన్న‌ర్ స్పందించాడు. ప్ర‌స్తుతం రాయ‌ల్స్ బెంగ‌ళూరు జ‌ట్టులో ఆడుతున్న చాహ‌ల్ త‌న పెళ్లికి తొంద‌ర లేదంటూ చెప్పుకొచ్చాడు.

అదే స‌మ‌యంలో కన్నడ హీరోయిన్ తనిష్కా కపూర్‌తో త‌న సంబంధం కేవ‌లం స్నేహం వ‌ర‌కూ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ‘‘అందరికి నమస్కారం, నా జీవితంలో ఎటువంటి మార్పులు జరగడం లేదని స్పష్టం చేసేందుకు ఈ సందేశం. నేను పెళ్లి చేసుకోవడం లేదు. తనిష్కా నేను మంచి స్నేహితులం మాత్రమే. ఈ వార్త ప్రచారం ఆపేయాలని నా విన్నపం. నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారాని ఆశిస్తున్నా. దయచేసి వదంతులు ప్రచారం చేయడం అపండి. ఏదైన వార్త తెలిస్తే… అది నిజమో కాదో నిర్ధారణ చేసుకున్న తర్వాత పోస్ట్ చేయండి. ధన్యవాదాలు’’ అని చాహల్ పేర్కొన్నాడు. అయితే త‌నిష్కాతో చాహ‌ల్ క‌లిసి ఉన్న ఫోటోలు వైర‌ల్ అవుతుండ‌డం విశేషం.






Related News

8 నెలల్లో కోహ్లీకిది ఆరోది

Spread the love ట్రెం‌‌ట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు.Read More

రెండో రోజు బౌల‌ర్ల‌దే..!

Spread the loveతొలిరోజు టీమిండియా బ్యాట్స్ మెన్ రాణించారు. తొలిసారిగా మిడిలార్డ‌ర్ రాణించ‌డంతో జ‌ట్టు మంచి స్కోర్ సాధించింది. అయితేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *