Main Menu

కోహ్లీకి మ‌ళ్లీ అవ‌మానం

Spread the love

టీమిండియా కెప్టెన్ ని హేళ‌న చేయ‌డం విదేశీ గ‌డ్డ‌పై సాధార‌ణంగా మారుతోంది. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ లో ఇలాంటి అనుభ‌వం ఎదురుకాగా, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ప‌దే ప‌దే జ‌రుగుతుండ‌డంతో ఆ దేశ క్రికెట్ బోర్డ్ సీరియ‌స్ అయ్యింది. ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీ రెండుసార్లు అవమానానికి గురయ్యాడు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఆసీస్ ప్రేక్షకులు కోహ్లీని వెకిలి చేష్టలతో అవమానించారు. తాజాగా సిడ్నీ టెస్టులోనూ కోహ్లీకి అటువంటి అనుభవమే ఎదురైంది. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ఆసీస్ అభిమానులు అతడిని వెక్కిరిస్తూ విపరీత వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా ప్రవర్తించారు.

కోహ్లీకి రెండుసార్లు ఇదే అనుభవం ఎదురుకావడంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ తీవ్రంగా స్పందించాడు. అభిమానులు ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నాడు. దేశానికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరికాదంటూ ప్రేక్షకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతిథులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికాడు. ‘‘మనందరికంటే ఆట గొప్పది. అతిథులను మనం గౌరవించాలి. మన దేశానికి వచ్చినప్పుడు వారికి అందమైన అనుభవం ఇవ్వాలి. అయితే, మైదానంలో మాత్రం కలబడాలి’’ అని పేర్కొన్నాడు






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *