Main Menu

బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు

Spread the love

బీజేపీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. తాజాగా ఆపార్టీలో కొన‌సాగ‌డం సుర‌క్షితం కాదంటూ ఓ న‌టి గుడ్ బై చెప్పేసింది. మ‌లికా రాజ్ పుత్ రాజీనామా చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మోడీ ఇమేజ్ చూసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె, ప్ర‌స్తుతం వ‌రుస‌గా వెలుగులోకి వ‌స్తున్న ఉన్నావ్, క‌తువా వంటి కేసుల నేప‌థ్యంలో ఆపార్టీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదంటూ రాజీనామా చేశారు.

అదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఇద్ద‌రు స్టార్ క్రికెటర్ల కోసం చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దాంతో క‌మ‌ల‌ద‌ళం కొంత నిరాశ‌కు గుర‌య్యింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ గ‌డ్డ మీద బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దాంతో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ వంటి సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌ను క్లీన్ ఇమేజ్ ఉండ‌డంతో ఉప‌యోగించుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేసింది. ఓవైపు గాలి జ‌నార్థ‌న్ రెడ్డి వంటి మైనింగ్ మాఫియా కోటాలో 9 మందికి టికెట్లు ఇచ్చి, మ‌రోవైపు కుంబ్లే, ద్రావిడ్ క్రేజ్ వాడుకోవాల‌ని క‌మ‌లం ఆశించింది.

కానీ ఆ ఇద్ద‌రు బీజేపీ ప్ర‌తిపాద‌న‌ను తోసిపుచ్చారు. ముఖ్యంగా స‌చిన్ రిటైర్ కావ‌డంతో రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ తిర‌స్క‌రించ‌డం విశేషంగా మారింది. బెంగ‌ళూరులో సిద్ధిరామ‌య్య స‌ర్కారుకి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌లేమంటూ ఇద్ద‌రు మొఖం చాటేయ‌డం విశేషం. దాంతో బీజేపీ మ‌రిన్ని ఆఫ‌ర్ల వ‌ల విసురుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు వారు సిద్ధ‌ప‌డితే బీజేపీ ఉప‌యోగించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. కానీ ప‌రిస్థితులు దానికి విరుద్ధంగా ఉండ‌డం విశేషం. ఆట‌గాళ్లుగా అద్భుతంగా రాణించిన ఈ ఇద్ద‌రు, ప్ర‌స్తుతం కోచ్ లుగానూ విశేషంగా ప్ర‌తిభ చూపారు. క్రీడారంగంలో మ‌రికొన్నాళ్లు కొన‌సాగాల‌ని ఆశిస్తున్న నేప‌థ్యంలో పొలిటిక‌ల్ గ్రౌండ్ లో ఎంట్రీకి నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం.






Related News

టాప్ లో టీమిండియా

Spread the loveతాజా ర్యాంకింగ్స్ లో టీమిండియాకు తిరుగు లేదు. కెప్టెన్ కోహ్లీ కూడా అదే రేంజ్ లో సాగుతున్నాడు.Read More

స్టేడియంలోనే కోహ్లీకి ముద్దు

Spread the loveటీమిండియా కెప్టెన్ కి విచిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌య్యింది. విండీస్ తో హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న మ్యాచ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *