Main Menu

పెళ్ళి పీటలపైకి టీమిండియా ఫాస్ట్ బౌలర్

Spread the love

త్వరలో మరో భారత క్రికెటర్‌ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో అభిమానులకు చెప్పేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగే సమయంలో ఓ రెస్టారెంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కూర్చుని దిగిన ఫొటోలో తాను మాత్రమే కనిపించేటట్టు సోషల్‌మీడియాలో ఉంచి డిన్నర్‌ డేట్‌.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా. అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఇన్నాళ్లకు భువీ తన భాగస్వామి ఎవరో అభిమానులకు చూపించాడు. తాజాగా తన ట్విటర్‌లో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఉంచి నా జీవిత భాగస్వామి ఫొటో ఇదే అంటూ పరిచయం చేశాడు. ఆమె పేరు నుపూర్‌ అని భువీ తెలిపాడు. ఈ ఏడాది మేలో భువీ సగం ఫొటోని ట్విటర్‌ ద్వారా పంచుకున్నప్పుడు అతడు డేటింగ్‌ చేస్తోంది ఓ సినీనటితో అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీటికి స్పందించిన భువీ ఆ వార్తలను ఖండించి.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి. సమయం వచ్చినప్పుడు ఆమె ఎవరన్నది నేనే చెప్తాను అని అన్నాడు. ప్రస్తుతం భువీ.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. కంగారూలతో జరిగిన వన్డే సిరీస్‌లో ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *