ఆసీస్ చరిత్రలో తొలిసారిగా..

ban vs aus
Spread the love

బంగ్లాదేశ్ సంచలనం నమోదు చేసింది. క్రికెట్ రారాజులగా భావించే ఆస్ట్రేలియాను ఖంగుతినిపించింది. అనూహ్యంగా మట్టి కరిపించింది. ఆసీస్ చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూశారు. దాంతో బంగ్లాదేశ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బంగ్లాబేబీలు రికార్డ్ విజయం నమోదు చేశారు. 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఖంగు తినిపించారు. రెండో ఇన్నింగ్స్ లో 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ ను 244 రన్స్ కే ఆలౌట్ చేసి బంగ్లాదేశ్ విజయకేతనం ఎగురవేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సీనియర్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ ప్రతాపం చూపించాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ ఐదేసి వికెట్ల చొప్పున తీసి ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. బంగ్లా స్పిన్నర్లు రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 19 వికెట్లు తీయడం విశేషం. బంగ్లా స్పిన్ ఎటాక్ కి తలవంచిన ఆస్ట్రేలియా చివరకు పరాజయం మూటగట్టుకుంది.

షకీబుల్ అటు బ్యాటింగ్ లో కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో 84 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ ని అందించాడు. అదే విధంగా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తరుపున డేవిడ్ వార్నర్ 112 పరుగుల భారీ స్కోర్ తో సెంచరీ సాదించినప్పటికీ మిగిలిన ఆటగాళ్ల వైఫల్యం జట్టు కొంప ముంచింది.

ఇంగ్లాడ్ తో జరుగుతున్న సిరీస్ లో సుమారు 17 ఏళ్ల తర్వాత నిన్న ముగిసిన టెస్టులో విజయం సాధించిన వెస్టిండీస్ సంచలనం మరచిపోకముందే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రతాపం టెస్ట్ క్రికెట్ లో కొత్త పరిణామాలకు ఆధారంగా మారుతున్నాయి.

Score:
ఆస్ట్రేలియా 217, 244 ఆలౌట్
బంగ్లాదేశ్ 260, 221


Related News

hardik-28-1521641582-302081-khaskhabar

చిక్కుల్లో హార్థిక్ పాండ్యా

Spread the love2Sharesటీమిండియా ఆల్‌రౌండ‌ర్‌ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోరి క‌ష్టాలు తెచ్చుకున్నాడు. నోటిదుర‌ద‌తో ఇప్పుడు న్యాయ‌స్థానాల ముందుRead More

crciket dressing room

రెచ్చిపోయిన క్రికెటర్లు

Spread the love1Shareనిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితేRead More

 • చిక్కుల్లో ష‌మీ: సందిగ్ధంలో కెరీర్
 • టీమిండియా బౌల‌ర్ పై బౌన్స‌ర్ వేసిన భార్య‌
 • పాండ్యా ల‌వ్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు
 • ద్రావిడ్ కి షాకిచ్చిన క్రికెట్ బోర్డ్
 • కోహ్లీ సేన‌కు మ‌రుపురాని సిరీస్
 • వైర‌ల్ గా మారిన కోహ్లీ కిస్
 • కోహ్లీ సృష్టించిన మ‌రో చ‌రిత్ర‌
 • కోహ్లీ కొత్త చరిత్ర
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *