రెచ్చిపోయిన క్రికెటర్లు

crciket dressing room
Spread the love

నిదాహాస్ టీ20 టోర్నీలో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌ల్ చ‌ల్ చేశారు. కెప్టెన్ ష‌కీబుల్ అయితే ఏకంగా చొక్కా విప్పి వీరంగం చేశాడు. అంత‌కుముందు ఫైన‌ల్ ఓవ‌ర్ రెండు బంతులు పూర్త‌వ‌గానే త‌న ఆట‌గాళ్ల‌ను బ‌య‌ట‌కు రావాలంటూ ప‌దే ప‌దే పిలిచి వివాదానికి తెర‌లేపాడు. బౌన్స‌ర్ ని నోబాల్ గా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. అయితే మిగిలిన టీమ్ స‌హాయ‌క బృందం న‌చ్చ‌జెప్ప‌డంతో చివ‌ర‌కు ఆట కొన‌సాగింది. బంగ్లాదేశ్ అనూహ్యంగా విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్య‌మంగా మ‌హ‌మ‌దుల్లా అద్భుత బ్యాటింగ్ తో ఆఖ‌రి ఓవ‌ర్ చివ‌రి మూడు బంతుల్లో 4,2,6 సాధించి జ‌ట్టుని ఫైన‌ల్ కి చేశాడు. ఆ వెంట‌నే నాగినీ డ్యాన్స్ తో గ్రౌండ్ లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు హ‌డావిడి చేశారు.

అంత‌టితో స‌రిపెడితే స‌రిపోయేది. గెలుపు ఇచ్చిన ఉత్సాహమో, ఫైనల్‌కు చేరామన్న ఆనందమో కానీ విజయం అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వెంటనే విజిటర్స్ డ్రెస్సింగ్ రూము అద్దాలను బ్యాట్‌తో ధ్వంసం చేసి ఆనందం పంచుకున్నారు. దాంతో అది పెద్ద వివాదంగా మారింది. శ్రీలంక బోర్డ్ తో పాటు ఐసీసీ కూడా సీరియ‌స్ గా ప‌రిగ‌ణించింది. దాంతో ఈ ఘటనపై స్పందించిన బంగ్లాదేశ్ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ నష్టాన్ని భరించనున్నట్టు తెలిపింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీలంక అభిమానులు ప‌లువురు బంగ్లా ఫ్యాన్స్ మీద దాడి కి పాల్ప‌డ్డారు. ఓట‌మిని జీర్ణించుకోలేని లంక అభిమానులు ఈ దుశ్చ‌ర్య‌కు ఒడిగ‌ట్టారు. త‌మ దేశ 70ఏళ్ల స్వ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన టోర్నీలో సొంత జ‌ట్టు ఫైన‌ల్ కి కూడా చేర‌లేక‌పోవ‌డాన్ని ఫ్యాన్స్ స‌హించ‌లేక‌పోతున్నారు.


Related News

Sania-Mirza-1

కొత్త‌పాత్ర‌లో సానియా మీర్జా

Spread the love3Sharesఇండియ‌న్ టెన్నీస్ బ్యూటీ, పాకిస్తాన్ కోడ‌లు సానియా మీర్జా కొత్త పాత్ర ధ‌రించ‌బోతోంది. వ‌చ్చే అక్టోబ‌ర్ లోనేRead More

chahal

క‌న్న‌డ హీరోయిన్ తో సంబంధంపై చాహ‌ల్ ..

Spread the loveక‌న్న‌డ హీరోయిన్ తో టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్Read More

 • బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు
 • సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు
 • ఐపీఎల్ మార్చేస్తున్నారు…
 • ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం
 • మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్
 • ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్
 • క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్
 • ఏడాది వేటు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *