ఏడాది వేటు

DZXYUN5XkAEx63K
Spread the love

ఆస్ట్రేలియా అభిన‌వ బ్రాడ్ మ‌న్ క్రీడా జీవితం అనూహ్యంగా చిక్కుల్లో ప‌డింది. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ తీసుకున్న నిర్ణ‌యంతో ఏడాది పాటు తెర‌మ‌రుగు కావాల్సి వ‌స్తోంది. ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలుంటాయ‌న్న‌ది ఊహించ‌డ‌మే క‌ష్ట‌మ‌ని ప‌లువురు క్రీడా పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కేప్ టౌన్ టెస్టులో బాల్ ట్యాంప‌రింగ్ తో దొరికిపోయిన వ్య‌వ‌హారంలో ఐసీసీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. కేవ‌లం ఒక మ్యాచ్ నిషేధం మాత్రమే విధించింది. దానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి

అదే స‌మ‌యంలో ఆస్ట్రేలియాలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దేశం ప‌రువు తీశారంటూ తీవ్రంగా మండిప‌డ్డారు. ఆ దేశ ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్ అయ్యింది. దాంతో చివ‌ర‌కు సీఏ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ , వైస్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ పై ఒక ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దాంతో పాటు ట్యాంప‌రింగ్ కి పాల్ప‌డిన ఆట‌గాడు బెన్ క్రాఫ్ట్ పై కూడా నిషేధం విధించారు. మాత్రం తొమ్మిది నెల‌ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి వుంది. స్మిత్, వార్న‌ర్ ఏడాది పాటు అన్ని స్థాయిల్లోనూ క్రికెట్ నుంచి వెలివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఏడాది వ‌ర‌కూ స్మిత్, బెన్ క్రాఫ్ట్ పేర్ల‌ను కెప్టెన్ గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేది లేద‌ని ప్ర‌క‌టించారు. అయితే డేవిడ్ వార్న‌ర్ కి మాత్రం జీవితాంతం కెప్టెన్ అవ‌కాశం లేకుండా నిర్ణ‌యం తీసుకున్నారు. దాంతో స్మిత్ స్థానంలో ఆసీస్ కెప్టెన్ గా పైనే బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నాడు.

ఏడాది నిషేధ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే ఐపీఎల్ నుంచి కూడా ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను నిషేధిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ గా ఇప్ప‌టికే స్మిత్ ని తొల‌గించి అజింక్యా ర‌హానేని న‌య‌మించారు. ఇప్పుడు ఆట‌గాడి కూడా కొన‌సాగించే అవ‌కాశం లేద‌ని ప్ర‌క‌టించారు. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ గా వార్న‌ర్ తొల‌గింపు ఖాయం అయ్యింది. నిర్ణ‌యం వెలువ‌డ‌గానే స్మిత్ భావోద్వేగానికి గుర‌య్యాడు. జోహ‌న్న‌స్ బ‌ర్గ్ హోట‌ల్ లో ఉన్న స్మిత్ తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్టు చెబుతున్నారు.


Related News

Sania-Mirza-1

కొత్త‌పాత్ర‌లో సానియా మీర్జా

Spread the love3Sharesఇండియ‌న్ టెన్నీస్ బ్యూటీ, పాకిస్తాన్ కోడ‌లు సానియా మీర్జా కొత్త పాత్ర ధ‌రించ‌బోతోంది. వ‌చ్చే అక్టోబ‌ర్ లోనేRead More

chahal

క‌న్న‌డ హీరోయిన్ తో సంబంధంపై చాహ‌ల్ ..

Spread the loveక‌న్న‌డ హీరోయిన్ తో టీమిండియా స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్Read More

 • బీజేపీకి షాకిచ్చిన స్టార్ క్రికెట‌ర్లు
 • సైనాదే పై చేయి: మ‌ళ్లీ సిల్వ‌ర్ సింధు
 • ఐపీఎల్ మార్చేస్తున్నారు…
 • ఐపీఎల్ మ్యాచ్ లో అతి పెద్ద త‌ప్పిదం
 • మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో టీమిండియా క్రికెటర్
 • ఆఫ్రీదికి గంభీర్ ఘాటు కౌంట‌ర్
 • క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్
 • ఏడాది వేటు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *