Main Menu

ఆసీస్ కి అనూహ్య దెబ్బ‌

Spread the love

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టుకి అనూహ్యంగా ఎదురుదెబ్బ త‌గిలింది. అడ్డంగా దొరికిపోయి వేటుకి గుర‌య్యింది. జ‌ట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ స‌హా అంతా కెమెరా సాక్షిగా ట్యాంప‌రింగ్ కి పాల్ప‌డి దొరికిపోవ‌డంతో ఆ జట్టు తీవ్రంగా స‌త‌మ‌తం అవుతోంది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఆ జ‌ట్టు క‌ష్టాలు రెట్టింప‌య్యాయి. రెండో ఇన్నింగ్స్ లో కేవ‌లం 107ర‌న్స్ కే అలౌట్ అయ్యింది. చివర‌కు ఘోర ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. సిరీస్ లో 2-1 తేడాతో వెనుక‌బ‌డింది. తొలి టెస్టు గెలిచిన‌ప్ప‌టికీ ఆత‌ర్వాతి రెండు టెస్టులు వ‌రుస‌గా ఓట‌మి పాలు కావ‌డంతో ఆస్ట్రేలియా జ‌ట్టుకి సిరీస్ ఓట‌మి వెంటాడుతోంది.

ఈలోగా ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంతో కెప్టెన్ స్మిత్ ,డేవిడ్ వార్న‌ర్ లు జ‌ట్టుకి దూర‌మ‌య్యారు. ఈనేప‌థ్యంలో ఆసీస్ కెప్టెన్సీని మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ బంతిని ట్యాంపరింగ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ట్యాంపరింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను బాధ్యతల నుంచి తప్పించింది. తాజాగా ఘటనపై క్లార్క్ స్పందిస్తూ.. తమ ఆటగాళ్లు క్షమించరాని నేరం చేశారని పేర్కొన్నాడు. స్మిత్ చేసింది చాలా పెద్ద నేరమని తనకు తెలుసన్నాడు. సమస్య సద్దుమణిగాక స్మిత్ తిరిగి కెప్టెన్‌గా కొనసాగుతాడని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే 2015లో చివ‌రి టెస్ట్ ఆడి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్మిత్ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తే మాత్రం అదో చ‌రిత్ర అవుతుంది.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *