Main Menu

మ‌న్క‌డింగ్ ఎందుకు వివాదంగా మారింది?

Spread the love

‘మన్కడింగ్’ క్రికెట్‌లో చాలా అరుదుగా వినిపించే పేరు! ఇప్పటికీ చాలామందికి దీని గురిం చి తెలియదు! కానీ.. ఒక్కసారి ఈ పేరు వినిపించిందంటే కొద్దిరోజుల పాటు దాని జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయ! ఓటమి సమయాల్లో బౌలర్లకు అస్త్రంగా మారిన ‘మన్కడింగ్’ ఎన్నో వివాదాలను సృష్టించిందనే చెప్పాలి! దిగ్గజ క్రికెటర్లు సైతం క్రికెట్‌లో ఈ నిబంధన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ బాహాటంగానే వ్యతిరేకించారు. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి ‘మన్కడింగ్’ తెరమీదికొచ్చింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సమయంలో 13వ ఓవర్ బౌలింగ్ వేస్తున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న జోస్ బట్లర్‌ను రనౌట్ చేయడంతో మళ్లీ ‘మన్కడింగ్’ వివాదం తలెత్తింది!

మన్కడింగ్ నిబంధనేంటి?
క్రికెట్‌లో 41.16 నిబంధన ప్రకారం మన్కడింగ్ రూల్ సరైనదే. బౌలర్ తన బౌలింగ్ యాక్షన్ పూర్తికాకముందే అవతలి వైపు (నాన్ స్ట్రైక్ ఎండ్) ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు వదలి బయటకు వస్తే బౌలర్ బంతి వేయడం ఆపి రనౌట్ చేసే అవకాశముంది. అయతే దీనిని చాలామంది ఆటగాళ్లు వ్యతిరే కించారు. క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమంటూ పేర్కొన్నారు. 1948 లో భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించింది. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్‌ను భారత బౌలర్ వినూ మన్కడ్ రెండు సార్లు ఇలాగే ఔట్ చేయడంతో ఈ నిబంధనను అప్పటి నుంచి మన్కడింగ్ నిబంధనగా పిలుస్తున్నారు.

ఒక్కసారైనా హెచ్చరించాలి..
మన్కడింగ్ నిబంధనతో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలంటే కనీసం ఒక్కసారైనా నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్ మన్‌ను బౌలర్ హెచ్చరించాలి. అయతే 2017లో మారిన నిబంధనల ప్రకారం హెచ్చరిక లేకుండానే బౌలర్ అవుట్ చేసే వీలు కల్పించారు.

వాల్ష్ క్రీడా స్ఫూర్తి..
1987 ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకోగా, విండీస్ మాత్రం ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌కు పాకిస్థాన్ గెలవాలంటే 14 పరుగులు అవసరం. అదే విండీస్ గెలుపునకు 1 వికెట్ కావాలి. అవతలి వైపు వాల్ష్ బౌలిం గ్, ఇటు క్రీజులో అబ్దుల్ ఖాదీర్, సలీం జాఫర్‌లు. మొదటి రెండు బంతులకు చెరో సింగల్ తీశారు. మూడో బంతికి ఖాదీర్ 2 పరుగులు చేయగా, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో పాక్ 2 బంతుల్లో 4 పరుగులు చేయాలి. అయతే అప్పటికే తను బంతిని వేయకముందే అవతలి వైపున్న సలీం జాఫర్ క్రీజు వదిలి రన్ తీసేందుకు ప్రయత్నించిన వాల్ఫ్ రెండు, మూడు సార్లు హెచ్చరించి, మన్కడింగ్ ద్వారా అవుట్ చేసే వీలున్నా అవుట్ చేయకుండా వదిలేశాడు. దీంతో ఐదో బంతికి రెండు, ఆరో బంతికి రెండు పరుగులు చేయడంతో పాక్ గెలుపొందింది. ఈ క్రీడా స్ఫూర్తితో విండీస్ ఓడినా, వాల్ష్ మాత్రం ఎంతోమంది మనసులను గెలుచుకున్నాడు.


Related News

ఫైన‌ల్స్ హైద‌రాబాద్!

Spread the love ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించ నున్నారు. అలాగే ప్లే ఆఫ్‌లోని రెండుRead More

పాండ్యా, రాహుల్ కి మ‌రో షాక్

Spread the loveప్ర‌పంచ క‌ప్ జ‌ట్టుకి ఎంపికయిన సంతోషంలో ఉన్న టీమిండియా ఆట‌గాళ్ల‌కు షాక్ త‌గిలింది. ముఖ్యంగా హార్థిక్ పాండ్యాకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *