Main Menu

ధోనీ గ్రేడ్ పడిపోతోంది..

Spread the love

భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ‘ఎ’ గ్రేడ్‌కు బీసీసీఐ ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది.అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ధోనీని బీసీసీఐ అగ్రశ్రేణి కాంట్రాక్టులో ఉంచడంపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా కాంట్రాక్టులో అతడి పేరును అగ్రశ్రేణి నుంచి తప్పించాలని బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌ కమిటీ(సీవోఏ) భావిస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గత ఏడాది నవంబరు 30న సారథి విరాట్‌ కోహ్లీ, ధోనీతో పాటు కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐ సీవోఏను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై కసరత్తులు చేపట్టిన సీవోఏ కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పటికే తుది నివేదిక తయారు చేసిందట. దీన్ని త్వరలో బీసీసీ ఫైనాన్స్‌ కమిటీకి అందజేయనుంది. ఏ ప్లస్‌, ఏ, బీ, సీ ఇలా నాలుగు శ్రేణుల ద్వారా ఆటగాళ్లకు జీతాలు అందజేయాలనుకుంటుంది. ఈ తాజా నివేదికలో ధోనీ తన అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోయినట్లు తెలుస్తోంది.






Related News

కోహ్లీ చుట్టూ కొత్త వివాదం

Spread the loveటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్య‌వ‌హారం కొత్త వివాదానికి దారితీస్తోంది. బీసీసీఐ కి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.Read More

సిరీస్ పోయినా అది మిగిలింది…!

Spread the loveఇంగ్లడ్ గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌లో టీమిండియా ప‌రాజ‌యం పాల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో త‌నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *