Main Menu

వైసీపీలో వైవీ చిచ్చు

Spread the love

వైసీపీలో కొత్త వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కలకలం రేపుతున్నారు. వైైసీపీలో అలజడి రేపుతున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన ఇప్పుడు ప్రకంపనలు పట్టిస్తుండడం ఆందోళనకరంగా మారుతోంది.

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సీటుకి వచ్చే ఎన్నికల్లో మాగంటి శ్రీనివాసుల రెడ్డిని రంగంలో దింపాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఆయన పార్టీలో చేరగానే ఎంపీ టికెట్ కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.

అయితే అందుకు తగ్గట్టుగా ఈసారి ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి తన సీటుని త్యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరకూ ఆయన పూర్తిగా గోదావరి జిల్లాల పార్టీ వ్యవహారాలకే పరిమితం అయినప్పటికీ హఠాత్తుగా స్వరం మార్చేశారు. తనకే సీటు కావాలంటూ సంచలన ప్రకటన చేశారు.

దాంతో వైసీపీలో ఈ వ్యవహారం మీద భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వైవీ సుబ్బారెడ్డి తీరు మీద పలువురు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలకే మింగుడుపడని పరిస్థితిగా చెబుతున్నారు. రాజకీయంగా టీడీపీ నుంచి పార్టీలో చేరేందకు సిద్ధమవుతున్న మాగుంటకి బ్రేకులు వేసే పరిణామాలుగా వీటిని భావిస్తున్నారు.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *