Main Menu

ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ

ongole
Spread the love

ప్ర‌కాశం జిల్లాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై వైసీపీ నేత‌లు దృష్టిలో పెట్టారు. అందులో భాగంగా ప‌లువురు నేత‌ల‌ను పార్టీలో చేర్చ‌కోవ‌డానికి స్కెచ్ వేశారు. ఇప్ప‌టికే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఓ సీనియ‌ర్ ఎమ్మెల్సీతో చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సాకార‌మ‌య్యే దిశ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే కొలిక్కివ‌స్తాయ‌ని భావిస్తున్నారు. ఆయ‌న‌కు తోడుగా మ‌రో ఒక‌రిద్ద‌రు, నేత‌లు సిద్ధ‌మ‌వుతార‌ని స‌మాచారం.

అదే స‌మ‌యంలో మాజీ మంత్రి మానుగంటి మ‌హేంద‌ర్ రెడ్డి కూడా ముహూర్తం ఖ‌రారయిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కందుకూరు మ‌హిధ‌ర్ రెడ్డికి కేటాయించ‌డానికి జ‌గ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే పార్టీలో చేరే ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌ని అంటున్నారు. దానికి అంగీక‌రించి మహీధర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బాలినేని కూడా సముఖంగా ఉన్న నేపధ్యంలో త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

కొద్దికాలం క్రిత‌మే వైసీపీలో మానుగుంట చేరాల్సి ఉండగా అనివార్యకారణాల వలన వాయిదాపడింది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని గతంలోనే మ‌హిధ‌ర్ రెడ్డి కలిసిన స‌మ‌యంలో హామీ ద‌క్కింది. ఆ సమయంలో కందుకూరు మునిసిపల్ ఎన్నికలు, తదితర కారణాలరీత్యా మానుగుంట పార్టీలో చేరలేదు. ప్రస్తుతం మాత్రం ముందుగా జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో నియోజకవర్గంలో ముందుగా ఎన్నికలు నిర్వహించాలంటే సమర్థవంతమైన నాయకుడు మానుగుంట అవసరం ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రతిసీటులో గెలుపుకీలకం కానుంది. ఇందులో భాగంగానే వైసీపీ గెలుపుగుర్రాల వేటలో పడింది. ఈనేపధ్యంలో జిల్లాపార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గమనించి మహీధర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్దమయ్యారు.

ఇక కందుకూరు త‌ర్వాత క‌నిగిరి, అద్దంకి, ద‌ర్శి స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలోకి ప‌లువురు నేత‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ భావిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఓవైపు వైవీ సుబ్బారెడ్డి, మ‌రోవైపు బాలినేని రంగంలో దిగి పావులు క‌దుపుతున్నారు. టీడీపీని నైతికంగా దెబ్బ‌కొడితే ఆత‌ర్వాత ప్ర‌జాక్షేత్రంలో ఓడించ‌గ‌ల‌మ‌నే ఉద్దేశంతో ఎత్తులు వేస్తున్నారు. మ‌రి ఈ ఆప‌రేష‌న్ ప్ర‌కాశం జిల్లా ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Related News

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the loveవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

లైన్ క్లియ‌ర్ చేస‌కున్న ఆనం

Spread the loveమాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న వైసీపీ లో చేర‌డడం ఖాయంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *