జగన్ కి జ్వరమొచ్చింది

Jagan-Plenary
Spread the love

వైసీపీ అధినేత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం విరామమెరుగక శ్రమించిన జగన్ జ్వరం బారిన పడ్డారు. దాంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల నంద్యాల ఎన్నికల సందర్భంగా జగన్ విస్త్రుతంగా పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వర్షంలో తడిచిన మూలంగానే వైరల్ ఫీవర్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు.

జ్వరం, ఒంటినెప్పులతో జగన్ బాధపడుతున్నారు. దాంతో ఆయనకు కనీసం రెండు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో కాకినాడలో ఆయన పర్యటన సందిగ్ధంలో పడింది. ఈనెల 26న షెడ్యూల్ ప్రకారం జగన్ కాకినాడలో రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. పలు వార్డుల్లో ఆయన ప్రచారానికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. అయితే జగన్ కి జ్వరం తగ్గకపోతే వస్తారా రారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకపోయినా ఎన్నికల ప్రచారం కోసం వచ్చి తీరుతారని ఆపార్టీ నేతలు ధీమా గా ఉన్నారు.


Related News

1736_ysrcp

సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే

Spread the loveవైసీపీ కి చెందిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. సీబీఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీRead More

2360_somireddy-chandramohan-reddy

అవునా..సోమిరెడ్డిని నిలదీస్తే శిక్షా?

Spread the loveగ్రామ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తికి గ్రామ పెద్దలుRead More

 • జగన్ కి జ్వరమొచ్చింది
 • వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్
 • ఎమ్మెల్యే గారి పెళ్లి
 • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
 • జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ
 • ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!
 • గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!
 • ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *