వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్

ysrcp-party-flag-647x450
Spread the love

వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచింది. ఆసక్తిగా మారుతోంది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు రోజు విచారణకు రావాలంటూ ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులందడం చర్చనీయాంశం అవుతోంది. నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

నెల్లూరులో రేకెత్తించిన క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియాపై కొనసాగుతున్న విచారణ కొత్త మలుపు తిరిగింది. క్రికెట్‌ బుకీలకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సహకారం అందిచారని పోలీసులు భావిస్తున్నారు. కేసుకి సంబంధించి ఇద్దరినీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. వీరిలో వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు. వారిద్దరికీ 160 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ అయ్యాయి. వీరిని ఈనెల 22న ఎస్పీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు అధికారులు ఆదేశించారు.

అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం నంద్యాలలో ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇద్దరికీ నంద్యాలలో నోటీసులు అందించినట్టు సమాచారం. కాగా, రేపు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే పోలీసుల తీరును వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే ఎన్నికల ముందు ఇలాంటి కుట్రలకు తెరలేపి ఉంటారని అనుమానిపిస్తున్నారు. వైసీపీని బద్నాం చేయడంలో అధికార పార్టీ వ్యూహాలకు పోలీసులు వంతపాడుతున్నట్టుందని ఆరోపిస్తున్నారు. అయితే వారి వాదన ఎలా ఉన్నప్పటికీ 22న విచారణకు హాజరువుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.


Related News

1736_ysrcp

సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే

Spread the loveవైసీపీ కి చెందిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. సీబీఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీRead More

2360_somireddy-chandramohan-reddy

అవునా..సోమిరెడ్డిని నిలదీస్తే శిక్షా?

Spread the loveగ్రామ సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తికి గ్రామ పెద్దలుRead More

 • జగన్ కి జ్వరమొచ్చింది
 • వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్
 • ఎమ్మెల్యే గారి పెళ్లి
 • టీడీపీ ఎమ్మెల్యేకి షాకిచ్చిన గ్రామస్తులు
 • జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ
 • ఉండ‌వ‌ల్లి, ద‌గ్గుపాటి క‌ల‌యిక వెనుక‌..!
 • గిద్ద‌లూరు టీడీపీ క‌ట్ట‌లు తెంచుకుంది..!
 • ఆప‌రేష‌న్ ప్ర‌కాశం ప్రారంభించిన వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *