సీబీఐ చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే

1736_ysrcp
Spread the love

వైసీపీ కి చెందిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. సీబీఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు సీబీఐ కేసుల్లో ఉండగా తాజాగా మరో ఎమ్మెల్యే చేరడం విశేషంగా మారుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మీద సీబీఐ కేసు నమోదయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన భార్య, చెన్నై ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న టీహెచ్‌ విజయలక్ష్మిపైనా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

adimulam

ఈ కేసులో విజయలక్ష్మిని ఏ-1గా పేర్కొనగా, సురేశ్‌ను ఏ-2గా పేర్కొన్నారు. సురేశ్‌ ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు సురేశ్‌ ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీసు(ఐఆర్‌ఏఎ్‌స)లో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ హోదాలో పనిచేశారు. 2009లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే ఏడాది ఎర్రగొండపాలెం నియోజవకర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2010-2016 మధ్యకాలంలో సురేశ్‌ దంపతులు ఆదాయాలను లెక్కించిన సీబీఐ వారు ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారని గుర్తించి కేసు నమోదు చేసింది. ఈమేరకు బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ దంపతులు భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2010-16 మధ్యకాలంలో వీరి ఆదాయం రూ.4.84కోట్లు కాగా, వీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ రూ.5.95 కోట్లుగా ఉందని, సుమారు రూ.1.10 కోట్లు విలువైన ఆస్తులను ఆదాయానికి మించి కూడబెట్టారని సీబీఐ పేర్కొంది.


Related News

TDP-flags-AFP

టీడీపీకి యువ నేత రాజీనామా

Spread the loveనెల్లూరు జిల్లా రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. జగన్ పాదయాత్ర జిల్లాలో ప్రవేశించడంతో కదలికలు మొదలవుతున్నాయి. పలువురుRead More

vakati

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్థానికRead More

 • వైసీపీలో ముదురుతున్న విబేధాలు
 • టీడీపీలో కలకలం కేసులో మేయర్
 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *