Main Menu

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love

ఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానే ప్ర‌క‌టిస్తాన‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ అభ్య‌ర్థుల జాబితా ఖ‌రార‌య్యింది. జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థుల పేర్లు క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అన్న‌ట్టుగా మారింది. .

ఆ జాబితా ఇలా ఉంది.

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి
కొండెపికి మాదాసు వెంకయ్య
కందుకూరు నుండి మానుగుంట మహీధర్‌రెడ్డి
కనిగిరి నుండి బుర్రా మధుసూదన్‌యాదవ్
ద‌ర్శి నుండి మద్దిశెట్టి వేణుగోపాల్
ఎర్రగొండపాలెం నుండి ఆదిమూలపు సురేష్
గిద్దలూరు నుండి అన్నా రాంబాబు
సంతనూతలపాడు నుండి టిజెఆర్ సుధాకర్‌బాబు
అద్దంకి నుండి బాచిన చెంచుగరటయ్య
పర్చూరు నుండి దగ్గుబాటి చెంచురాం హితేష్
చీరాల నుండి ఆమంచి కృష్ణమోహన్ పేర్లు ఖాయం అయ్యాయి. ఇక మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌కే వెంక‌ట‌రెడ్డికే అవ‌కాశాలున్నాయి. ఆయ‌న‌కే జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వ‌డం ఖాయం అయితే మొత్తం అన్ని స్థానాల‌లోనూ అభ్య‌ర్థుల ఎంపిక పూర్తయిన‌ట్ట‌గానే భావించాలి.

ఇదిలా ఉండగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రానున్న ఎన్నికల్లో తనకే టిక్కెట్ కేటాయించాలని వైవి జగన్‌ను కోరుతున్నారు. ఢిల్లీలో జాతీయస్థాయి నాయకులతో చర్చించే సమయంలో జగన్ ఆనవాయితీగా తన బాబాయి సుబ్బారెడ్డిని తీసుకెళ్లినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో జిల్లా రాజకీయాలపై శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద జగన్ వైవి సుబ్బారెడ్డికి రాజకీయంగా తగిన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *