Main Menu

ఆమంచివి మూయించారు..

Spread the love

టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కి అడ్డంకి ఏర్ప‌డింది. చీరాల ఎమ్మెల్యే క్వారీలు సీజ్ అయ్యాయి. ఆయనతో పాటు బంధువుల‌కు సంబంధించిన ఇసుక ర్యాంపుల‌పై విజిలెన్స్ అధికారులు సీరియ‌స్ అయ్యారు. సీజ్ చేశారు. ఆమంచి ఇసుక అక్ర‌మాల‌పై చాలాకాలంగా ప్ర‌చారం ఉంది. ప‌లు ఆరోప‌ణ‌లు, ప‌లుమార్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ ఇన్నాళ్లుగా చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేని అధికారులు హ‌ఠాత్తుగా స్పందించి మైనింగ్ ని అడ్డుకోవ‌డం వెనుక కార‌ణాలు ఆస‌క్తిగా మారాయి.

ఆమంచి ఇసుక అక్రమ దందాలే కాకుండా అనేక ఇతర ఆరోపణలున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగానూ, ప్ర‌స్తుతం ఇండిపెండెంట్ గా గెలిచిన సైకిలెక్కిన అసోసియేట్ స‌భ్యుడిగానూ ఆమంచి అదికారాన్ని అడ్డం పెట్టుకుంటార‌నే వాద‌న ఉంది. వారు త‌వ్వ‌కాలు చేస్తున్న అక్రమ క్వారీలపై ఆరోపణలు తీవ్రం కావ‌డంతో చివ‌ర‌కు విజిలెన్స్‌ అదికారులు మైనింగ్‌పై దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది.

చివ‌ర‌కు తాజాగా రెండు రోజుల క్రితం మొద‌లైన‌ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదికారులు జరిపిన దాడుల్లో అక్రమ లావాదేవీలు బయట పడినట్లు సమాచారం ఇప్పటికీ 6 క్వారీలను సీజ్‌ చేశారు. చినగంజాం మండలంలోని కడవకుదురులో 2 క్వారీలతో పాటు వేటపాలెం మండలంలోని పందిళ్ళ పల్లిలో ఉన్న 4 క్వారీలను విజిలెన్స్‌ అదికారులు సీజ్‌ చేశారు. ఈ ప‌రిణామాల ప‌ట్ల చీర‌ల‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది.






Related News

వైసీపీ లో పెరిగిన పోటీ!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంపై ఆశ‌తో సాగుతున్న వైసీపీలో వేడి పుడుతోంది. టికెట్ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ప్ర‌కాశంRead More

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి ఆ సీటు ఖాయం..!

Spread the loveనెల్లూరు జిల్లా వైసీపీ లో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌లు మార్పులు జ‌రుగుతున్నాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *