జ‌గ‌న్ ని పొగిడి, బాబుని తెగిడిన టీడీపీ ఎంపీ

jagan-ysrcp-tdp
Spread the love

ప్ర‌స్తుతం తెలుగుదేశం నేత‌ల్లో చాలామంది ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారే. ఆపార్టీనే న‌మ్ముకుని ఎటూ మార‌కుండా ఉన్న వాళ్లు వేళ్ల‌మీద లెక్కించ‌ద‌గ్గ‌వారే క‌నిపిస్తున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు కూడా కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారేన‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అలాంటి స‌మ‌యంలో య‌న‌మ‌ల వంటి అతి కొద్ది మంది మాత్ర‌మే ప్ర‌స్తుత క్యాబినెట్ లో పూర్తిస్థాయి తెలుగుదేశం వారున్నారు. ఇక ఎంపీల విష‌యానికి వ‌స్తే టీడీపీలో ఎదిగిన నేత‌లు చాలా నామ‌మాత్రం. చివ‌ర‌కు రాజ్య‌స‌భ స్థానాల‌యితే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే ప్రాధాన్య‌త ద‌క్కుతోంది. అలాంటి వారిలో టీజీ వెంక‌టేష్ ఒక‌రు. ఆయ‌న టీడీపీ ని వీడి కాంగ్రెస్ లో చేరి మంత్రిగానూ బాధ్య‌త‌ల నిర్వ‌హించి మ‌ళ్లీ టీడీపీలో ఎంపీ అయిపోయారు.

1980_TDP MP TG Venkatesh

అయితే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌యుడిని ఎమ్మెల్యే చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. ఈ బిజినెస్ పొలిటీషియ‌న్ ప‌దవీ ప్ర‌యోజ‌నాల కోసం ఏం చేసినా ఆశ్చ‌ర్చ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎస్వీ మోహ‌న్ రెడ్డి మూలంగా క‌ర్నూలు టీడీపీ సీటు ద‌క్క‌ని స‌మ‌యంలో వైసీపీ వైపు ఆయ‌న మొగ్గుతార‌ని భావించినా అతిశ‌యోక్తి అనిపించుకోదు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తాజాగా ఆయ‌న వ్యాఖ్య‌లున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైశ్యుల ఓట్లు కీల‌కంగా మారాయి. ఫ‌లితాల‌ను నిర్దేశించ‌గ‌ల స్థాయిలో ఉండ‌డంతో వైశ్యుల కోసం రెండు ప్ర‌ధాన పార్టీలు గాలం వేస్తున్నాయి. అందులో భాగంగా వైశ్యుల‌కు కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దాంతో ప‌లువురు వైశ్య‌లు ఆయ‌న్ని అభినందించారు. చివ‌ర‌కు టీడీపీ ఎంపీగా ఉన్న టీజే వెంక‌టేష్ కూడా జ‌గ‌న్ కి ధ‌న్య‌వాదాలు చెప్పారు. వైశ్యుల కోసం కార్పోరేష‌న్ ఏర్పాటు చేయ‌డం జ‌గ‌న్ మంచి నిర్ణ‌య‌మ‌ని కొనియాడారు. తామంతా టీడీపీ అధినేత‌ను క‌లిసి కార్పోరేష‌న్ ఏర్పాటు కోసం అడిగితే ఆర్య‌వైశ్యుల కుకాకుండా మొత్తం ఓసీలంద‌రికీ క‌లిపి కార్పోరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని వాపోయారు. ఇత‌ర ఓసీల‌తో వైశ్యుల‌ను క‌లిపితే ఏమీ ద‌క్క‌ద‌ని తెలిపారు. త‌ద్వారా చంద్ర‌బాబు విధానాల‌ను త‌ప్పుబ‌డుతూనే ప్ర‌తిప‌క్ష నేత‌ను ఆయ‌న అభినందించ‌డం విశేషంగా మారింది.

దాంతో ఇప్పుడు టీజే వెంక‌టేష్ వ్యాఖ్య‌లు నంద్యాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రాధాన్య‌త‌గ‌ల అంశంగా మారాయి. టీజే ఎప్పుడు కామెంట్స్ చేసినా వాటి ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా జ‌గ‌న్ కి సానుకూలంగా ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌భావం వైశ్య ఓట‌ర్ల మీద ఉంటుంద‌నే అభిప్రాయం బ‌ల‌పడుతోంది. ఏమైనా టీజే తీరు వేరుగా క‌నిపిస్తోంది. చివ‌ర‌కు ఏ తీరాన చేరునో అని చూడాల్సి ఉంది.


Related News

1736_ysrcp

వైసీపీలో ముదురుతున్న విబేధాలు

Spread the loveవైసీపీకి పట్టున్న జిల్లాల్లో రాయలసీమ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలే కనిపిస్తాయి. గడిచిన ఎన్నికల్లో కొన్ని సీట్లుRead More

nellore mayor ajeej

టీడీపీలో కలకలం కేసులో మేయర్

Spread the loveటీడీపీ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వివిధ రాష్ట్రాల్లో కేసుల్లో ఇరుకుంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్Read More

 • రెచ్చిపోయిన అధికార పార్టీ నేత, విధ్వంసం
 • అద్దంకి గరటయ్యదే..
 • బూచేపల్లికి బుజ్జగింపు
 • టీడీపీకి నీటి గండం
 • వైసీపీ లో వార్
 • పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్
 • టీడీపీ తీరుపై రోడ్డెక్కిన బీజేపీ
 • మళ్లీ కొట్టుకున్నారు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *