Main Menu

టీడీపీకి అభ్య‌ర్థులు కావ‌లెను..!

Spread the love

తెలుగుదేశం పార్టీకి ఆ రెండు సీట్లు శిరోభారంగా మారుతున్నాయి. విప‌క్షానికి గ‌ట్టి ప‌ట్టున్న ఆ స్థానాల‌లో త‌గిన అభ్య‌ర్థుల కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప‌డుతోంది. దాంతో వైసీపీ సిట్టింగ్ ఎంపీ స్థానాల‌యిన ఒంగోలు, నెల్లూరు సీట్లు టీడీపీకి పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్నాయి.

గ‌డిచిన ఎన్నికల్లో టీడీపీ త‌రుపున ఈ స్థానాలలో పోటీ చేసిన ఇద్ద‌రు నేత‌లు ఈసారి పోటీకి దూర‌మ‌య్యారు. నెల్లూరు ఎంపీ సీటు వ‌ద్ద‌ని ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యే గిరీ కోసం బ‌రిలో దిగారు. నెల్లూరు రూర‌ల్ సీటు ఫిక్స్ చేసుకున్నారు. ఇక మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి ఒంగోలు లో తాను నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌ని తేల్చేశారు. ఆ సీటులో బ‌రిలో దిగేందుకు నిరాక‌రించారు. దాంతో తెలుగుదేశానికి ఇద్ద‌రు కొత్త అభ్య‌ర్థుల వేట త‌ప్ప‌డం లేదు.

నెల్లూరు సీటుని బీసీ కోటాలో బీదా మ‌స్తాన్ రావుకి కేటాయించాల‌ని బాబు ఆలోచించారు. కానీ ఆయ‌న మాత్రం చేతులు కాల్చుకోవ‌డం నావ‌ల్ల కాదంటూ కావ‌లి ఎమ్మెల్యే సీటు కోసం ఆస‌క్తి చూపుతున్నారు. ఇక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో జెడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డిని గానీ, వంటేరు వేణుగోపాల్ రెడ్డిని గానీ రంగంలో దింపే అవ‌కాశం ఉంది. అయితే వారిద్ద‌రూ ఎంపీ స్థాయి కాద‌ని, వారి కార‌ణంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు కూడా స‌మ‌స్య అవుతుంద‌నే అభ్యంత‌రాలు వినిపిస్తున్నాయి. అయినా టీడీపీకి మ‌రో ఆప్ష‌న్ క‌నిపించ‌డం లేదు. క‌నీసం మాగుంట ని నెల్లూరు తీసుకురావాల‌నే ప్ర‌తిపాద‌న చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌సేమీరా అంటూ పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డంతో తెలుగు దేశం పార్టీ అధినేత‌కు మ‌రో గత్యంతరం లేని ద‌శ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక ఒంగోలులో కూడా అదే ప‌రిస్థితి ఉంది. మాగుంట స్థానంలో క‌ర‌ణం బ‌ల‌రాంని రంగంలోకి తీసుకురావాల‌ని ఆశించిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాక‌రించి, చీరాల వైపు క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ సీటు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న చంద్ర‌బాబు ఒంగోలు ఎంపీ స్థానానికి కొత్త నేత‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే య‌త్నాల్లో ఉన్నారు. ఏమ‌యినా టీడీపీని ఈ రెండు స్థానాల స‌మ‌స్య వేధిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. విప‌క్షం బ‌లంగా ఉన్న చోట త‌గిన నేత‌ను బ‌రిలో దింప‌డ‌మే ఇప్పుడు ప‌రీక్ష‌గా మారుతోంది.






Related News

ఆదాల సెంటిమెంట్: జ‌గ‌న్ కి క‌లిసొస్తుందా?

Spread the loveనెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో చిత్ర విచిత్ర ప‌రిణామాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏకంగా పార్టీ టికెట్Read More

వైసీపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the loveఇప్ప‌టికే విప‌క్షం క‌స‌ర‌త్తులు పూర్తి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను నోటిఫికేష‌న్ రాగానేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *