Main Menu

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

vakati
Spread the love

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. విచారణ కోసం వాకాటిని బెంగళూరుకు పిలిచిన అధికారులు.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేశారంటూ వాకాటిపై అభియోగాలున్నాయి.

దాంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వాకాటి అరెస్ట్ కలకలం రేపుతోంది. టీడీపీ ఆయనపై సస్ఫెన్షన్ ప్రకటన చేసినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన కనిపిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఏకంగా సీబీఐ అరెస్ట్ చేసేవరకూ సీన్ రావడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలయ్యింది. వాకాటి శామీర్‌పేటలోని 12 కోట్ల విలువ చేసే స్థలాన్ని.. 240 కోట్ల విలువైన స్థలంగా చూపించి… ఐఎఫ్సీఐ నుంచి 180 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారనే అభియోగాలున్నాయి. అంతేకాకుండా ఆ రుణం చెల్లించకపోవడంతో… ఐఎఫ్సీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో సీబీఐ అధికారులు వాకాటిని బెంగళూరుకు పిలిచి.. అదుపులోకి తీసుకున్నారు.






Related News

9173_ysrcp-3

వైసీపీ తెర‌మీద‌కు కొత్త నేత‌లు

Spread the loveవైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. రాజ‌కీయంగా జ‌గ‌న్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ల విష‌యంలోRead More

07-1457330006-28-anam-ramanarayana-reddy-600

లైన్ క్లియ‌ర్ చేస‌కున్న ఆనం

Spread the loveమాజీ మంత్రి ఆనం రామ‌నారాయణ రెడ్డికి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఆయ‌న వైసీపీ లో చేర‌డడం ఖాయంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *