Main Menu

వైసీపీకి ఊర‌ట‌: టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతు

Spread the love

తెలుగుదేశం ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. తాజా ప‌రిణామాల‌తో అధికార పార్టీ ఆశ‌లు పండ‌లేదు. వైసీపీ నుంచి కొంద‌రు నేత‌లను చీల్చాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దాంతో టీడీపీ నేత‌ల్లో నిరాశ నిస్పృహ‌లు క‌నిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో వైసీపీలో ఊర‌ట క‌నిపిస్తోంది. కొత్త ఆశ‌లు చిగురుస్తున్నాయి. దాంతో కొంత క‌ల‌వ‌ర‌ప‌డిన‌ప్ప‌టికీ గ‌డిచిన రెండు మూడు రోజులుగా వ‌స్తున్న మార్పుల‌తో వైసీపీ నేత‌ల్లో కొంత ధీమా పెరుగుతోంది.

ముఖ్యంగా కాకినాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌డిచిన ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పారిశ్రామిక‌వేత్త చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం వైసీపీలో గంద‌ర‌గోళం సృష్టించింది. బ‌ల‌మైన యువ నేత పార్టీలో విబేధాల‌తో దూర‌మ‌యితే న‌ష్టం వ‌స్తుంద‌నే అభిప్రాయం వినిపించింది. ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు చేజారితే స‌మ‌స్య‌ల‌ని చాలామంది క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. కానీ తాజాగా సునీల్ మ‌న‌సు మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న సోద‌రుడు ఎంత ఒత్తిడి తెచ్చినా టీడీపీలో చేర‌డానికి ఆయ‌న ససేమీరా చెప్పేసిన‌ట్టే అని భావిస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు అనుకూల మీడియాలో వ‌రుస క‌థ‌నాల త‌ర్వాత సునీల్ మీద ఒత్తిడి పెరిగింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న మూడో అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతారంటూ ప్ర‌చారం కూడా ఊపందుకుంది. కానీ ప్ర‌స్తుతం టీడీపీ మూడో సీటుకి పోటీ చేసే అవ‌కాశం లేకుండా పోయింది. దాంతో పాటు తాజాగా రాజ‌కీయ ప‌రిణామాల‌తో టీడీపీ డిఫెన్స్ లో ప‌డింది. ఇలాంటి సంద‌ర్భంలో సైకిలెక్క‌డం అంటే స‌మ‌స్య‌లు కొనితెచ్చుకోవ‌డ‌మేన‌ని సునీల్ భావిస్తున్నారు. దాంతో ఆయ‌న టీడీపీ ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాకినాడ ప‌రిస‌రాల్లో ఆయ‌న అభిమానుల్లో వైసీపీ నాయ‌కుడిగా ఆయ‌న పుట్టిన‌రోజు పేరుతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం అందుకో సంకేతంగా అంచ‌నా వేస్తున్నారు. గోదావ‌రి జిల్లాల్లో పుంజుకోవ‌డం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న వైసీపీకి ఇది ఊర‌ట‌నిచ్చే అంశం.

ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిణామాల నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్యే శివ ప్ర‌సాద్ రెడ్డి పార్ట్టీ వీడుతున్నార‌నే ప్ర‌చారం సాగింది. అది కూడా వైసీపీకి కొంత ఉలికిపాటు క‌లిగించింది. ఆపార్టీ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేసింది. కానీ తీరా జ‌గ‌న్ పిలిచి మాట్లాడిన త‌ర్వాత మాధ‌వ్ కి మ‌ద్ధ‌తివ్వ‌డానికి బూచేప‌ల్లి అంగీక‌రించ‌డంతో ద‌ర్శి వైసీపీలో దిగాలు తీరిపోయింది. దాంతో అక్క‌డ కూడా వైసీపీ నుంచి కీల‌క నేత టీడీపీ వైపు మ‌ళ్లుతున్న‌ట్టు చేసిన ప్ర‌చారం తేలిపోయింది ఇరు కీల‌క నేత‌ల పార్టీ ఫిరాయింపులు లేవ‌ని స్ప‌ష్ట‌మ‌య్యింది. దాంతో టీడీపీ ఢీలా ప‌డ‌గా, వైసీపీకి ఊర‌టనిస్తుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.


Related News

సోమిరెడ్డికి సొంతింట్లోనే సెగ‌

Spread the loveఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి షాక్ త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే ఆయ‌న వ‌రుస‌గా ఎన్నిక‌ల్లో ఓట‌మిRead More

తెలుగు తమ్ముళ్ల త‌గాదాలో ద‌గ్గుబాటికి క‌లిసొచ్చేనా?

Spread the loveతెలుగుతమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయి చేరుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టిసారించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *